మన భారతదేశంలో జనవరి 22వ తేదీన రామ్ లల్లా ( Ram Lalla )విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహించారు.2024వ సంవత్సరంలో మొదట్లోనే ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగింది.ముఖ్యంగా చెప్పాలంటే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత రామ విగ్రహం రంగు గురించి కూడా ఎక్కడ చూసినా చర్చ జరుగుతూనే ఉంది.నల్ల రంగు దేవుడి విగ్రహాన్ని దేవాలయంలోనే కాకుండా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా అనే సందేహం ఎంతో మంది భక్తుల మదిలో మొదలైంది.
అయితే ఈ విషయం పై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.పండితులు చెప్పిన దాని ప్రకారం రామాయణంలో శ్రీ రాముని నల్లని రంగు గురించి చర్చించారని తెలిపారు.అందుకే రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే సమయంలో విగ్రహం రూప కర్త అరుణ్యోగి ( Arunyogi )ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు మూర్తికి( Vishnu Murthy ) సంబంధించిన అన్ని అవతారాలను ఆయన విగ్రహంలో చూపించగా, అతను రామాయణం ఆధారంగా విగ్రహాన్ని కూడా ముదురు రంగు లో చెక్కారు.
ఇంకా చెప్పాలంటే రాములవారి విగ్రహాన్ని తయారు చేసిన రాయి నలుపు రంగులో ఉంటుంది.ఈ రాముడి విగ్రహం చాలా సంవత్సరాలు అలాగే ఉంటుందని ఆయన వెల్లడించారు.అంతే కాకుండా విగ్రహాల్లో మాతా కాళీ, భైరవనాథ్, శనిదేవుని విగ్రహాలు మాత్రమే నలుపు రంగులో ఉంటాయని పండితులు చెబుతున్నారు.పురాణ గ్రంథాల, శాస్త్రాల ప్రకారం నల్లని విగ్రహాలు ఇంట్లో ఉంచడం నిషేధం గా పరిగణిస్తారు.
మన ఇంట్లో కాకుండా మన ఇంటి చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో నల్ల రంగు విగ్రహాలను ప్రతిష్టించి పూజించవచ్చని పండితులు చెబుతున్నారు.