నాన్నని చూస్తుంటే పండగలా ఉంది... వాల్తేరు వీరయ్య పై సుస్మిత కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల అయ్యి థియేటర్లలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

 Seeing My Father Is Like A Festival... Sushmita Comments On Waltheru Veeraya ,s-TeluguStop.com

ఇక సంక్రాంతి పండుగకు మెగాస్టార్ అభిమానులకు మంచి కానుక ఇచ్చారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా వాల్తేరు వీరయ్య సినిమాకు అన్ని ప్రాంతాలలోనూ మంచి ఆదరణ లభిస్తుంది.

ఇక సినిమా విడుదలైన మొదటి రోజే చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సినిమాని వీక్షించారు.ఈ క్రమంలోనే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ సినిమా గురించి తన తండ్రి నటన గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

Telugu Chiranjeevi, Bobby, Sushmita-Movie

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ డైరెక్టర్ బాబి గారు కథ మొత్తం చెప్పిన తర్వాత నాన్నను ఈ సినిమాలో వింటేజ్ లుక్ తీసుకురావడం కోసం ప్రతి ఒక్క కాస్ట్యూమ్ విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని సుస్మిత తెలిపారు.ఇలా చాలా రోజుల తర్వాత నాన్నని ఈ లుక్కులో చూస్తుంటే అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారని ఈమె వెల్లడించారు.

Telugu Chiranjeevi, Bobby, Sushmita-Movie

ఇక ఈ సినిమా చూడటం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసామని అందుకే ఉదయం నాలుగు గంటలకే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసామని తెలిపారు.ఇక ఈ సినిమాలో నాన్నని, నాన్న నటన చూస్తుంటే అచ్చం ఓ పండుగలాగా ఉందని సుస్మిత వాల్తేరు వీరయ్య సినిమాలో తన తండ్రి చిరంజీవి నటనపై ప్రశంసలు కురిపించారు.ఇక నాన్నతో కలిసి ఎప్పటికైనా ఒక సినిమాని నిర్మించాలని నా కోరిక అందుకే కథ వేటలో ఉన్నామని మంచి కథ దొరికితే నాన్నతో సినిమా చేస్తానంటూ ఈ సందర్భంగా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube