శ్రీ క్రోద నామ( Sri Kroda Nama ) ఏడాదిలో మేష రాశి( Aries ) వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేష రాశికి కిందికి వస్తారు.
ఈ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14.రాజు పూజ్యం 4, అవమానం మూడుగా ఉంటుంది.మేష రాశి వారికి గురుడు ధన స్థానంలో, శని పదకొండవ స్థానంలో, రాహు కేతువులు ఆరవ స్థానంలో ఉండడం వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది.అలాగే ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది.
ఏడాది ప్రారంభంలో కొన్ని పనులు అసంతృప్తికరంగా ఉన్న ఆ తర్వాత పరిస్థితులన్నీ మెరుగుపడతాయి.
పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు.
సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు పెడతారు.
చేతిలో డబ్బు నిలబడదు.గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
బంధువుల మరణ వార్త వింటారు.ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ఈ రాశి ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతారు.

అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్( Permanent for contract employees ) అవుతుంది.నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు.ఉద్యోగం చేసే మహిళలకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది.కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని కచ్చితంగా పరిష్కరించుకుంటారు.
ఇప్పటి వరకు మీకు ఏ ఉద్యోగం లేదని ఎంతో అవమానానికి, బాధకు గురవుతున్నారో అలాంటి వారికి కచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది.అనుకున్న విధంగా అనుకున్న రంగంలో స్థిరపడతారు.
ఇక వ్యాపారంలో కూడా ఆశించినటువంటి లాభాలు పొందుతారు.

అలాగే సినిమా, టీవీ రంగంలో మీరు ఉన్నట్లయితే అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆదాయం బాగుంటుంది.ఇప్పటి వరకు మీరు ఎలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నారో అలాంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి.
మీరు కచ్చితంగా జీవితంలో స్థిరపడతారు.ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది.