మరికొన్ని గంటల్లో ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
భాష రాకపోతే యాక్టింగ్ చేయడం చాలా కష్టమని ఆమె తెలిపారు.సీతారామం మూవీ( Seetharam movie ) టైమ్ లో తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
సినిమా రిలీజ్ తర్వాత ఆ కష్టాన్ని మరిచిపోయానని ఆమె అన్నారు.
మహారాణి రోల్ లో నటించాలని నా చిన్నప్పటి కల అని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు.
ఆ రీజన్ వల్లే సీతారామం సినిమా కోసం సంప్రదించిన వెంటనే ఓకే చెప్పానని మృణాల్ అన్నారు.సీతారామం సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పానని తెలుగు డైలాగ్ ను ఇంగ్లీష్ లో రాసుకుని రాత్రంతా ప్రాక్టీస్ చేసేదానినని ఆమె తెలిపారు.
తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని మృణాల్ పేర్కొన్నారు.

సీతారామమే మొదటి చివరి సినిమా అని కశ్మీర్ ( Kashmir ) లో షూట్ సమయంలో దుల్కర్ కు చెప్పానని మృణాల్ తెలిపారు.దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )మాత్రం సీతారామం తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయని నాతో చెప్పారని ఆయన నమ్మకమే నిజమైందని మృణాల్ ఠాకూర్ కామెంట్లు చేయడం గమనార్హం.నేను దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు చేయనని మృణాల్ వెల్లడించారు.

నేను ఇల్లు, భూమిపై ఇన్వెస్ట్ చేస్తానని వాటిపై ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికైనా ఉపయోగమని ఆమె తెలిపారు.ట్రెండీగా కనిపించాలని అనుకోవడంలో తప్పు లేదని అయితే దానికోసం అవసరానికి మించి ఖర్చు చేయకూడదని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.మృణాల్ ఠాకూర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మృణాల్ ఠాకూర్ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.







