చాలామంది ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ఎటువంటి కష్టాలు ఉండవని వాళ్ళ జీవితంలో లగ్జరీగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు.కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్లే.
ఎందుకంటే సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు కూడా అందరివి ఒకటే విధంగా ఉండవు.కొన్ని కొన్ని సార్లు కొందరు సెలబ్రిటీల జీవితాలు తారుమారు అవడం తలకిందులవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
సినిమా ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు ఒకప్పుడు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత డబ్బులు లేక కనీసం తినడానికి తిండి లేకపోతే చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.
అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా ఒకరు.
అతని పేరు సీతారాం పంచల్.( Sitaram Panchal ) స్లమ్‌డాగ్ మిలియనీర్, పీప్లీ లైవ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, జాలీ ఎల్‌ఎల్‌బి 2, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సీతారాం పంచల్ గురించే ఇదంతా తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ నటుడు 10 ఆగస్టు 2017న పేదరికంలో మరణించాడని తెలిస్తే మీరు షాక్ అవుతారు.
స్లమ్‌డాగ్ మిలియనీర్( Slumdog Millionaire ) చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది.వెండితెరపై ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సీతారాం నిజ జీవితంలో మాత్రం పేదరికంతో తన ప్రయణాన్ని ముగించాడు.

కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కదల్లేని పరిస్థితికి చేరుకున్నాడు.దీంతో సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు.ఈ లోపు సినిమాల ద్వారా ఆయన కూడబెట్టిన డబ్బంతా కరిగిపోయింది.అయినా ఆరోగ్యం కుదుటపడలేదు.దీంతో సాయం కోసం చెయి చాపాడు.2017లో హర్యానా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది.ఆ డబ్బు కూడా చాల్లేదు.
అతని పరిస్థితిని గమనించిన సినీ ఆర్టీస్ట్ అసోసియేషన్( Cine Artists Association ) అతనికి ఆర్థిక సాయం చేయాలని నెటిజన్లను కోరింది.ఆయనకు సాయం చేయాలంటూ విరాళాల ఇవ్వాలని వేడుకుంది.కానీ ఆ సమయంలో కేవలం రూ.1,06,575 మాత్రమే వచ్చింది.

సరైన చికిత్స అందించేందుకు చేతిలో డబ్బు లేదు తాను కలిసి నటించిన స్టార్ హీరోలు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు.రోజులు గడిచాయి అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.బరువు పూర్తిగా తగ్గిపోయాడు.ఎవరూ గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.అలా 2017 ఆగష్టు 10న ఆయన మరణించాడు.తర్వాత ఒక ఇంటర్వ్యూలో సీతారాం పంచల్ భార్య( Sitaram Panchal Wife ) మాట్లాడుతూ.
నా భర్త డబ్బు లేక మాత్రమే చనిపోయాడు.ఆ సమయంలో సరైన చికిత్స అందించి ఉంటే బతికేవాడని డాక్టర్స్ చెప్పారు.
కానీ, నా వద్ద అందుకు సరిపడా డబ్బు లేదు.డబ్బు మాత్రమే ఉండి ఉంటే ఆయన బతికే వాడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను.
ఆయన చాలామంది స్టార్స్‌తో కలిసి నటించాడు.కానీ వారెవరూ సాయం చేయలేదు.
కనీసం చూసేందుకు కూడా రాలేదు ఆవేదన వ్యక్తం చేశారు.







