టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా నేటికీ కొన్ని ప్రాంతాల్లో చదువుకునే ఆడపిల్లలను ప్రోత్సహించే వాళ్లు తక్కువమంది ఉన్నారు.పెళ్లైన ఆడవాళ్లు చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
కొంతమంది చదువుకుంటామని చెబితే హేళన చేసేవాళ్లు, వెక్కిరించే వాళ్లు సైతం ఉంటారనే సంగతి తెలిసిందే.రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) భిల్వారికి చెందిన మహిళ మధు( Madhu ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.
ఒకప్పుడు మధు పిల్లల చదువు కోసం పాచి పనులు చేశారు.ప్రస్తుతం మధు పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా( Political Science Lecturer ) పని చేయడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు.
ఒకప్పుడు మధు పిల్లలకు ఒక స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వలేదు.అయితే ఇప్పుడు మధు పిల్లలు ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఎంతో కష్టపడి మధు ఈ స్థాయికి చేరుకున్నారు.

మధు మాట్లాడుతూ మేము ఆరుగురు తోబుట్టువులమని నాలుగేళ్ల వయస్సులో తండ్రి చనిపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు.ఇంటర్ పూర్తయ్యాక( Intermediate ) పెళ్లైందని ఆమె చెప్పుకొచ్చారు.నా భర్త వర్కర్ అని ఆయన సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోయేదని మధు వెల్లడించారు.
ఆ సమయంలో కుట్టుపని మొదలుపెట్టానని కొంతకాలానికి భర్త జాబ్ పోయిందని ఆమె అన్నారు.

నా పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చేర్పించాలని వెళితే ఫీజులు కట్టలేరని చేర్చుకోలేదని మధు పేర్కొన్నారు.బంధువులు, అత్త ఆమె చదువుకుంటానని చెబితే తిట్టేవారని మధు తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.అయితే మధు నెట్ లో అర్హత సాధించారు.
పొలిటికల్ సైన్స్ లో ఎం.ఏ( M.A Political Science ) చేసిన మధు పీహెచ్డీకి అడ్మిషన్ తీసుకున్నారు.భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకుని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
మధు సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.