కాంగ్రెస్ సవాల్.. బి‌ఆర్‌ఎస్ సిద్దమేనా ?

తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంట్ కు సంబంధించిన అంశం తీవ్ర హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 Congress Challenge.. Is Brs Ready, Congress Party, Brs, Revanth Reddy, Telan-TeluguStop.com

రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.కాంగ్రెస్ రైతులపై చిన్నచూపు వహిస్తుందని, రైతులకు మేలు చేస్తే కాంగ్రెస్ కు నచ్చడం లేదని బి‌ఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ప్రతి విమర్శలు చేస్తున్నారు.

అటు రైతుల నుంచి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొంత వ్యతిరేకతే వ్యక్తమౌతోంది.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన.

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Telugu Congress, Revanth Reddy, Telangana-Politics

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలౌతున్న 24 గంటల కరెంట్ పై బి‌ఆర్‌ఎస్( BRS party ) నేతలకు రేవంత్ రెడ్డి చేసిన సవాల్ చర్చనీయాంశం అవుతోంది.24 గంటల కరెంట్ ఇచ్చే గ్రామాలలో తాము ఓట్లు అడగమని, ఒకవేళ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని తేలితే బి‌ఆర్‌ఎస్ అక్కడ ఓట్లు అడగరాదని ” ఈ సవాల్ కు బి‌ఆర్‌ఎస్ సిద్దమా అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో రేవంత్ సవాల్ కు బి‌ఆర్‌ఎస్ డిఫెన్స్ లో పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Congress, Revanth Reddy, Telangana-Politics

ఒకవేళ రేవంత్ సవాల్ ను బి‌ఆర్‌ఎస్ స్వీకరిస్తే రాష్ట్రంలో ప్రతి గ్రామలోని రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ ( FEED BACK )తీసుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ రైతుల నుంచి 24 గంటల కరెంట్ పై సానుకూల స్పందన వస్తే.కాంగ్రెస్ ఇరుకున పడే అవకాశం ఉంది.అయితే మరికొందరు విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం ఇలాంటి సవాళ్ళు ఎన్నికల ముందు సర్వ సాధారణమేనని, వీటిని స్వీకరించేందుకు గాని, ప్రతిఘటించేందుకు గాని కేవలం మాటలతోనే తప్పా చేతలలో చేయడానికి నాయకులు ముందుకు రారని కొందరి భావన.

మొత్తానికి 24 గంటల కరెంట్ విషయంలో నోరు జారీ కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసిన రేవంత్ రెడ్డి.ఇప్పుడు కరెంట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ కు సవాల్ విసిరి ఆ పార్టీని డిఫెన్స్ లో పడేశారు మరి గులాబీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube