ఆయనో ముసలి నక్క ... వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

ఏపీలో వైసిపి( YCP ) అధికారం కోల్పోవడం , టిడిపి( TDP ) అధికారంలోకి రావడంతో టిడిపి నేతలు తమ నోటికి పని చెబుతున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి నేతలంతా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ వైసిపి నాయకులపై తమదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

 He Should Cancel The Identity Of The Old Fox Ycp, Tdp, Janasena, Bjp, Chandrabab-TeluguStop.com

తాజాగా టిడిపి సీనియర్ నేత బుద్ధ వెంకన్న వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని , పార్టీని కూడా రద్దు చేయాలని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు.

  విజయసాయిరెడ్డి ఒక శకుని,  అతని ఆటలు ఈ ఆంధ్రప్రదేశ్ లో సాగవని వెంకన్న అన్నారు.ముసలి నక్క విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ప్రధాని నరేంద్ర మోధికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు.

కారు కూతలు కూసిన ముసలి నక్కను మేము 2014 నుంచి 2019 వరకు వదిలేయడమే తప్పైపోయిందని వెంకన్న వ్యాఖ్యానించారు.పిల్లి పులి తోలు కప్పుకుని ప్రవర్తించినట్టు ప్రవర్తించారంటూ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.ఈ సందర్భంగా వల్లభనేని వంశీ పైన తీవ్రంగా మండిపడ్డారు.వెంకన్న ఆస్తులు కాజేస్తారని భయపడి పారిపోయి,  మీ మెప్పుకోసం అవాకులు చవాకులు మాట్లాడడని వంశీ పై విమర్శలు చేశారు.

వంశీ,  కొడాలి నాని అనే పిల్లులు లోకేష్( Lokesh ) జూమ్ మీటింగ్ లోకి వస్తే ఖండించలేదంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్క రోజుకే ఇలా అయితే ఎలా అయ్యా.  పిన్నెల్లి మా మీద మాచర్లలో దాడి చేయలేదా అంటూ వెంకన్న ప్రశ్నించారు.ప్రభుత్వం ఉన్నా , లేకపోయినా పోరాటం చేయాలని,  చంద్రబాబు,  నారా లోకేష్ కనుసైగ చేస్తే మీరు ఈ భూమి మీద ఉండగలరా అంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube