అక్కినేని అఖిల్( akkineni akhil ) బాలనటుడిగా ఒక సినిమాలో, హీరోగా ఐదు సినిమాలలో నటించగా హీరోగా నటించిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.అఖిల్ లాంగ్ హెయిర్ తో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని బ్లాక్ డ్రెస్( Black dress ) లో కనిపించిన ఫోటో వైరల్ అవుతోంది.
ఈ ఫోటో చూసిన అభిమానులు అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అఖిల్ సినిమా కోసం లుక్ మార్చుకున్నాడా? లేక నార్మల్ గానే ఈ లుక్ లో కనిపించారా అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకాల్సి ఉంది.అఖిల్ కొత్త లుక్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అఖిల్ రెమ్యునరేషన్ ( Akhil Remuneration )పరిమితంగానే ఉండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.
అఖిల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

అఖిల్ కొత్త సినిమా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని గతంలో వార్తలు వినిపించాయి.ఈ సినిమా కోసం ధీర( Dheera ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది.అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
అఖిల్ సైతం మీడియాకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.నాగార్జున అఖిల్ కెరీర్ పై ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అఖిల్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అఖిల్ పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఖిల్ లుక్స్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చే కథలకు అఖిల్ ఓటు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.







