ఆయనో ముసలి నక్క … వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

ఆయనో ముసలి నక్క … వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

ఏపీలో వైసిపి( YCP ) అధికారం కోల్పోవడం , టిడిపి( TDP ) అధికారంలోకి రావడంతో టిడిపి నేతలు తమ నోటికి పని చెబుతున్నారు.

ఆయనో ముసలి నక్క … వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

గత వైసిపి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి నేతలంతా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ వైసిపి నాయకులపై తమదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఆయనో ముసలి నక్క … వైసిపి గుర్తింపు రద్దు చేసుకోవాలి 

తాజాగా టిడిపి సీనియర్ నేత బుద్ధ వెంకన్న వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని , పార్టీని కూడా రద్దు చేయాలని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు.

  విజయసాయిరెడ్డి ఒక శకుని,  అతని ఆటలు ఈ ఆంధ్రప్రదేశ్ లో సాగవని వెంకన్న అన్నారు.

ముసలి నక్క విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ప్రధాని నరేంద్ర మోధికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు.

"""/" / కారు కూతలు కూసిన ముసలి నక్కను మేము 2014 నుంచి 2019 వరకు వదిలేయడమే తప్పైపోయిందని వెంకన్న వ్యాఖ్యానించారు.

పిల్లి పులి తోలు కప్పుకుని ప్రవర్తించినట్టు ప్రవర్తించారంటూ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా వల్లభనేని వంశీ పైన తీవ్రంగా మండిపడ్డారు.వెంకన్న ఆస్తులు కాజేస్తారని భయపడి పారిపోయి,  మీ మెప్పుకోసం అవాకులు చవాకులు మాట్లాడడని వంశీ పై విమర్శలు చేశారు.

"""/" / వంశీ,  కొడాలి నాని అనే పిల్లులు లోకేష్( Lokesh ) జూమ్ మీటింగ్ లోకి వస్తే ఖండించలేదంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క రోజుకే ఇలా అయితే ఎలా అయ్యా.  పిన్నెల్లి మా మీద మాచర్లలో దాడి చేయలేదా అంటూ వెంకన్న ప్రశ్నించారు.

ప్రభుత్వం ఉన్నా , లేకపోయినా పోరాటం చేయాలని,  చంద్రబాబు,  నారా లోకేష్ కనుసైగ చేస్తే మీరు ఈ భూమి మీద ఉండగలరా అంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు సివిల్స్ ర్యాంకర్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు సివిల్స్ ర్యాంకర్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!