కండలు పెరగాలని 6 లీటర్ల ద్రవం ఇంజెక్ట్ చేసుకున్నాడు.. కట్ చేస్తే..?

ఈరోజుల్లో చాలామంది యువకులు ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెడుతున్నారు.బలమైన కండలు తిరిగిన శరీరం కోసం వ్యాయామశాలల్లో గంటల కొద్దీ కష్టపడుతున్నారు.

 He Injected 6 Liters Of Liquid To Grow Muscles, If He Cuts It, Muscular Body, Ca-TeluguStop.com

కండలు పెంచడానికి ప్రోటీన్ పౌడర్ లాంటివి కూడా వాడతారు.కానీ, పాలకూర తినే కార్టూన్‌ క్యారెక్టర్‌ పొపాయ్ లాగా కండలు వెంటనే పెరిగిపోవు.

దీనికి చాలా సమయం, కృషి పట్టాలి.

అయితే, కిరిల్ టెరెషిన్( Kirill Tereshin ) అనే రష్యా కుర్రాడు కండలు పెంచుకోవడానికి చాలా వింతమైన, ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నాడు.“రష్యన్ పొపాయ్,” “బజూకా హ్యాండ్స్”( “Russian Popeye,” “Bazooka Hands” ) అనే పేర్లతో పిలవబడే కిరిల్ తన కండలు చాలా పెద్దగా పెంచుకోవాలనే పిచ్చిలో పడ్డాడు.అందుకే వాసెలిన్‌ ( Vaseline )లాంటి ద్రవ పదార్థాన్ని ఏకంగా ఆరు లీటర్లు తన చేతుల్లోకి ఎక్కువగా ఇంజెక్ట్ చేసుకున్నాడు.

దాంతో చేతులు చాలా ఉబ్బాయి.కిరిల్ ఈ వీడియోని టిక్‌టాక్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కానీ, అందరూ ఆశ్చర్యపడే బదులు, అతని ఆరోగ్యం పట్ల ఆందోళన పడ్డారు.

Telugu Bazooka, Litersliquid, Kirill Tereshin, Latest, Muscular, Nri, Russia, Va

వైరల్ అయిన వీడియో, అతని చేతులు అసహజంగా పెద్దవిగా ఉన్నట్లు కనిపించింది.నెటిజన్లు వింతగా ఉన్న అతడి పెదవులను కూడా గమనించారు.చాలా మంది కిరిల్ శ్రేయస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు, అతని పరిస్థితి ప్రాణాపాయంగా మారుతుందని, వైద్య సహాయం కోరాలని సూచించారు.

కిరిల్ చర్యల వల్ల రక్తనాళాలు, కణజాలు దెబ్బతింటాయని, దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు కామెంట్లు చేశారు.

Telugu Bazooka, Litersliquid, Kirill Tereshin, Latest, Muscular, Nri, Russia, Va

ఇంజెక్షన్ల వల్ల వచ్చే చిక్కుల తెలుసుకున్నాక అతడు జాగ్రత్త పడ్డాడు.పెట్రోలియం జెల్లీని, ప్రభావిత కణజాలాలను తొలగించడానికి అతను అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది.పరిస్థితి మరింత దిగజారితే చేతులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

మహిళలను ఆకర్షించాలనే ఆశతో తాను ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డానని ఆ తర్వాత ఒప్పుకున్నాడు.కండలు తిరిగిన సహజ రూపానికి వస్తేనే అందంగా ఉంటాయని తెలుసుకున్నాడు.

పెట్రోలియం జెల్లీని ఉపయోగించే ముందు, అతను తన కండరాలను నూనెతో పెంచుకోవడానికి ప్రయత్నించాడు, ప్రమాదాలు ఉన్నప్పటికీ, తనలాంటి కండలు తిరిగిన మగ వ్యక్తి అమ్మాయిలను ఈజీగా ఆకర్షించగలరని అతడు నమ్మాడు.ఆ తర్వాత అది ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube