ఏందయ్యా ఇది.. ఏటీఎం ఏమైనా వీరి ఇల్లా.. హాయిగా పడుకున్నారుగా..?

పంజాబ్‌లోని పాటియాలాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.ఆ ఘటనకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గగనదీప్ సింగ్ షూట్ చేశారు.

 What Is This Atm Or What If They Are Sleeping Comfortably In Their House, Patial-TeluguStop.com

ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.వైరల్ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కి చెందిన ఒక ఎయిర్ కండిషన్డ్ ATM గదిలో ముగ్గురు వ్యక్తులు నేలపై పడుకుని నిద్రపోతున్నట్లు కనిపించింది.

బయట పెరుగుతున్న ప్రేక్షకులను పట్టించుకోకుండా వారు చాలా సౌకర్యంగా నిద్రిస్తున్నట్లు కనిపించింది.ఈ ఘటన ఆన్‌లైన్‌లో చాలా చర్చలకు దారితీసింది.ATMలో భద్రత లేకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితులను నివారించడానికి ఎందుకు ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా (security guard)లేడని ప్రశ్నించారు.

ముఖ్యంగా మహిళలు ఈ ATM కి వెళ్ళినప్పుడు భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ భద్రతా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది.ఖచ్చితంగా ఏ ఏటీఎంలో ఈ సంఘటన జరిగిందో తెలుసుకోవడానికి ఏటీఎం ID లేదా ఆ స్థలం వివరాలను అడిగారు.

దాని ఆధారంగా వారు ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రయత్నిస్తారు.

ఇదిలా ఉంటే, ఈ చర్చ ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించే మరో మలుపు తిరిగింది.పంజాబ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిరంతరంగా ఉంచాలని కొందరు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా ఎండాకాలంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చి ప్రజలు ఎయిర్ కండిషన్డ్ ఏటీఎంలోకి వెళ్ళాల్సి వస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

అయితే, అభిప్రాయాలు రెండుగా ఉన్నాయి.కొందరు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వెళ్లిన వ్యక్తుల పట్ల సానుభూతి చూపించారు, వారిని అనుమతించాలని అన్నారు.మరికొందరు ఇలా మగవారు పడుకుని ఉంటే ఫిమేల్ కస్టమర్స్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.ఈ ఘటన పోలీసుల దృష్టిని కూడా ఆకర్షించింది.

ATMలో భద్రతా లోపం ఉందని, దానిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది పంజాబ్ పోలీసుల అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube