భారతీయ సినీ చరిత్రలో కల్కి సినిమా( Kalki 2898 AD ) ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారమే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కల్కి చూసి సినీ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా గర్వపడతారని నాగ్ అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో ఎమోషనల్ గా ఫీలవుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మైథాలజీ, సైన్స్ ను మిక్స్ చేసి సినిమాను తెరకెక్కించాలని ఎన్నో సంవత్సరాల నుంచి భావిస్తున్నానని కల్కి సినిమాతో ఆ లోటు తీరిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.అటు సైన్స్ పై ఇటు మైథాలజీపై నాకు ఆసక్తి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మైథాలజీకి సమపాళ్లలో సైన్స్ యాడ్ చేసి కల్కి తెరకెక్కించానని నాగ్ అశ్విన్( Nag Ashwin ) వెల్లడించారు.
క్యాస్టింగ్, టీమ్ డెడికేషన్ తో కల్కి తెరకెక్కించామని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.

నా కలను నేను నెరవేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.కల్కి సినిమా కొరకు టీం ఎంతగానో కష్టపడిందని ఆయన చెప్పుకొచ్చారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉండనుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
మరోవైపు కల్కి ట్రైలర్ వ్యూస్ పరంగా కూడా అదరగొడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి సినిమాపై ఫ్యాన్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఆ ఆశలను నిజం చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి షాకింగ్ ట్విస్ట్ ఎండ్ కానుందని తెలుస్తోంది.ప్రభాస్ మార్కెట్, రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఈ సినిమా ఎన్నో రెట్లు పెంచుతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.తర్వాత సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.