ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ( CM Chandrababu Naidu ) ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఏపీ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒకరు మాత్రమే ఉంటారు. పవన్ తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను నిన్న అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ప్రకటించారు.ఇంకా ఒక స్థానాన్ని ప్రకటించాల్సి ఉంది.పొత్తులో భాగంగా జనసేనకు( Janasena ) మూడు , బీజేపీకి( BJP ) ఒక స్థానాన్ని మంత్రివర్గంలో కేటాయించారు.కొత్త మంత్రివర్గంలో యువ నాయకులకు ఎక్కువగా అవకాశం కల్పించారు.సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది 17 మంది కొత్తవారు కి అవకాశం ఇచ్చారు.
ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం లభించింది.
బీసీలు ఎనిమిది మంది , ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు.బిజెపి నుంచి ఎవరిని మంత్రిగా ఎంపిక చేయాలనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా ఈ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు.
కొత్త మంత్రులు వీరే…
కొణిదల పవన్ కళ్యాణ్,( Konidela Pawan Kalyan ) నారా లోకేష్ ,( Nara Lokesh ) అచ్చెన్న నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్ , నిమ్మల రామానాయుడు, ఎస్ఎండి ఫరూక్ , ఆనం రామనారాయణరెడ్డి , పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ , కందుల దుర్గేష్ ,గుమ్మడి సంధ్యారాణి , బీసీ జనార్ధన రెడ్డి ,టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.