సినీనటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan )మాజీ సతీమణి రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈమె తన మాజీ భర్త గురించి అలాగే తన కొడుకు గురించి వరుస పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి తన కుమారుడు అకీరా ( Akira ) తన తండ్రి వెంటే ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే రేణు దేశాయ్ పలు సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ పట్ల ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఓ యూట్యూబ్ ఛానల్( Youtube Channel ) రేణు దేశాయ్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశారు.
అయితే ఆ వీడియోలో ఏముందో తెలియదు కానీ ఈ వీడియోకి అకీరాకి భారీ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరు( Chiru ) షాక్ లో రేణు దేశాయ్ అనే తంబ్ నైల్ మాత్రం పెట్టారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమాని ఈ వీడియోని రేణు దేశాయ్ కి ట్యాగ్ చేస్తూ ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు.ఈ పోస్ట్ పై స్పందించిన ఈమె ఇది పూర్తిగా అవాస్తవమని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలాంటి అసత్యపు వార్తలు చేయద్దని వీలైతే సినిమా స్క్రిప్ట్ ల గురించి రాయండి తప్ప ఇలాంటి అసత్యపు వార్తలను స్ప్రెడ్ చేయొద్దు అంటూ ఆ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.