కొణిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ.. చెదిరిన బావ బావమరిది బంధం 

చాలా రోజులుగా మెగా ఫ్యామిలీలో చిచ్చు నడుస్తోంది పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రాజకీయ పరిస్థితుల కారణంగా అల్లు ఫ్యామిలీ( Allu family ) దూరమైపోతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.నిజానికి ఇది కొణిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫామిలీ అనడానికి లేదు.

 Konidela Family Vs Allu Family ,allu Family, Konidela Family , Ycp, Allu Arjun-TeluguStop.com

ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు.తన మామ ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే వైసీపీలో ఉన్న తన వ్యక్తిగత స్నేహితుడి కోసం వెళ్లి ప్రచారం చేశాడు.

అల్లు అర్జున్ అక్కడే మొదలైంది అసలు చిచ్చు.అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేసుకున్నారు.

ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే భ్రమలు అందరు ఉంటారు.కానీ ఇప్పుడు ఆ భ్రమను తొలగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Allu Arvind, Allu, Chiranjeevi, Konidela, Konidela Allu, Pawa

తాజాగా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్( Allu Arjun ) తరఫున ఎవరు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది.చాలా ఏళ్లుగా అల్లు అరవింద్ తో పవన్ కళ్యాణ్ కి మంచి టర్మ్స్ లేవు కారణాలు ఏంటో తెలియదు కానీ అల్లు అరవింద్ అంటే చాలు పవన్ కళ్యాణ్ విరుచుకు పడిపోతాడు.ఇప్పుడు అదే తత్వం అల్లు అర్జున్ కి కూడా వచ్చింది గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు.మల్లి కాస్త వెనక్కి తగ్గాడు.

ఇక ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి లెక్కలు వాటి సమీకరణాల రూపు రేఖలు కూడా మారుతున్నాయి.కాబట్టి చిరంజీవి( Chiranjeevi ) తన తమ్ముడి విజయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో తన పక్కన ఎప్పుడూ ఉండే అల్లు అరవింద్ లేకపోవడంతో నిజంగానే అల్లు ఫ్యామిలీకి కొణిదల ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు.

Telugu Allu Arjun, Allu Arvind, Allu, Chiranjeevi, Konidela, Konidela Allu, Pawa

పైగా మోది పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిలతో కొత్త రాజకీయం చేయబోతున్నాడు.ఇలాంటి సందర్భంలో అల్లు అరవింద్( Allu Arvind ), అల్లు అర్జున్ వీరికి వ్యతిరేకంగా ఉండడానికి  కారణాలు ఏంటో మరికొన్ని రోజులు ఆగితే బయటకు వస్తాయి.ఇక పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం కోసం అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నాగబాబు సైతం అగ్నికి ఆజ్యం పోశారు.తమ్ముడు గెలుపు నీ ఎంజాయ్ చేయడం వరకు ఓకే కానీ ఫ్యాన్స్ ని గెలకడమే కాస్త ఇబ్బంది.

ఏది జరుగుతున్నా చిరంజీవి ఎప్పటి లాగానే గుమ్మనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.తాజాగా సాయి ధరంతేజ్ సైతం అల్లు అర్జున్ ని అలాగే అతని భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యాడు.

దీంతో కొణిదెల ఫ్యామిలీ ఒక గ్రూప్ అయిపోతే అల్లు ఫ్యామిలీ మరో గ్రూప్ అయిపోయిందని అభిప్రాయానికి వస్తున్నారు అందరూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube