ప్రస్తుతం టి20 వరల్డ్ కప్( T20 World Cup ) జోరుగా సాగుతుంది.ఇండియా సూపర్ హిట్ కి క్వాలిఫై అయిపోయింది.
అయితే ఈ గెలుపు అంత సునాయాసంగా ఏమీ జరగలేదు నిన్నటికి నిన్న అమెరికాతో మ్యాచ్ ఇండియాలోని మన వారి సత్తా ఏంటో అలాగే వీక్నెస్ ఏంటో కూడా చాలా క్లియర్ గా బయట పెట్టింది.న్యూయార్క్( New York ) లో టెంపరరీగా కట్టిన స్టేడియంలో జరిగిన అమెరికా వర్సెస్ ఇండియా టి20 మ్యాచ్ లో కేవలం 111 పరుగులు మాత్రమే చేసి భారత జట్టు ముందు చాలా చిన్న లక్ష్యాన్నే పెట్టింది అమెరికా.
అయితే ఆ లక్ష్యం నల్లేరు మీద నడకలాగే సాగుతుంది అని అందరూ అనుకున్నప్పటికీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ మరియు విరాట్ కోహ్లీ వికెట్లని సింగిల్ డిజిట్ లకే పరిమితం చేశారు.అలాగే ఈ వికెట్స్ తియ్యడంలో ప్రముఖ పాత్ర పోషించారు మన ఇండియన్ మూలాలు ఉండి అమెరికాలో స్థిరపడ్డ సౌరబ్ నేత్రవల్కర్.
అసలు ఎవరు ఈ సౌరబ్( Saurabh ) ఇతని నేపద్యం ఏంటి అమెరికాకు ఎలా ఆడుతున్నాడు అనే విషయాలను చాలామంది సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.సౌరబ్ మన ఇండియాలోని అండర్ 19 జట్టులో అనేకసార్లు ఆడాడు అలాగే యువరాజ్ బ్యాట్స్మెన్ వికెట్ అలాగే తీసిన హిస్టరీ ఉంది.ఇండియాలో క్రికెట్ ఆడుతున్న సమయంలో మయాంక్ అగర్వాల్ కెల్ రాహుల్ వంటి వారు అతడి సహచరులు.ముంబై తరఫున రంజి ట్రోఫీ ( Ranji Trophy )కూడా ఆడాడు.
అయితే సౌరబ్ ఇండియా జట్టుకు ఆడుతున్న క్రమంలో అతని కన్నా బలమైన బౌలర్ చాలామంది ఉండడంలో అవకాశాలు తగ్గాయి.దాంతో అప్పటికే చదువులో దిట్టైనా సౌరబ్ అమెరికా వెళ్ళిపోయి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఓరాకిల్ లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు.
అయితే ఏముంది క్రికెట్ తన రక్తంలో ఉంది అందుకే అమెరికా జట్టుకి ఆడటం మొదలుపెట్టాడు.నిన్నటి అతడి బౌలింగ్ చూసిన తర్వాత గతంలో సౌరబ్ నీ సెలెక్ట్ చేయలేని వారంతా కూడా తల పట్టుకోవాల్సిన పరిస్థితి.ఇక సౌరబ్ ని చూసిన ఇండియన్స్ అందరూ కూడా వేలాదిమంది టేకి బ్యాచ్ కి ప్రతినిధుల అమెరికాలో సెటిలైపోయాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక కాసేపు నిన్నటి మ్యాచ్ సంగతి పక్కన పెడితే ఎందుకో ముందు నుంచి అమెరికా క్రికెట్ విషయంలో చిన్న చూపు చూస్తుంది.
అది ఒకటే కాదు చైనా, రష్యా, యూరప్ కంట్రీస్ ఎక్కువగా క్రికెట్ ఆడవు అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి భవిష్యత్తులో అమెరికా కూడా మిగతా జట్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.