ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మొదటి సంతకం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఆయన ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ మేరకు మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ పైనే పెడతారా అనే దానిపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని , నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు అనుకున్నట్లుగానే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు విజయవాడకు రాగానే మెగా డీఎస్సీ( Mega DSC ) ఫైల్ పైన సంతకం పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
![Telugu Ap, Janasena, Janasenani, Dsc, Pavan Kalyan, Un Employees, Signature Dsc- Telugu Ap, Janasena, Janasenani, Dsc, Pavan Kalyan, Un Employees, Signature Dsc-](https://telugustop.com/wp-content/uploads/2024/06/Will-the-first-signature-be-placed-on-Mega-DSCb.jpg)
ప్రస్తుతం ఏపీ పాఠశాల విద్యాశాఖ ( AP School Education Department )పరిధిలోని విద్యాసంస్థల్లో దాదాపు 13 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే అధికారులు నివేదిక సిద్ధం చేశారు.దీని మేరకు ఆ 13 ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా చంద్రబాబు మెగా డీఎస్సీ ని ప్రకటించి తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంటారని అంత అంచనా వేస్తున్నారు .ఒకవేళ మెగా డీఎస్సీ అంశాన్ని పక్కన పెడితే రాజకీయంగా చంద్రబాబు అనేక విమర్శలు ఎదుర్కోవడంతో పాటు, నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
![Telugu Ap, Janasena, Janasenani, Dsc, Pavan Kalyan, Un Employees, Signature Dsc- Telugu Ap, Janasena, Janasenani, Dsc, Pavan Kalyan, Un Employees, Signature Dsc-](https://telugustop.com/wp-content/uploads/2024/06/Will-the-first-signature-be-placed-on-Mega-DSCc.jpg)
గత వైసిపి ప్రభుత్వం జాబ్ కేలండర్ ను ప్రతి ఏటా ప్రకటించి ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.అయితే గెలిచిన తరువాత అంశాన్ని పట్టించుకోకపోవడం , సచివాలయం ఉద్యోగాలు మినహా మరే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటివి నిరుద్యోగులకు ఆగ్రహాన్ని కలిగించింది.దీంతో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డీఎస్సీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని , మొదటి సంతకం దానిపైనే చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకే చంద్రబాబు పెట్టబోయే మొదటి సంతకం పైనే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.