ఇవివి సత్యనారాయణ( EVV Satyanarayana ) ఇండస్ట్రీకి పోతూ పోతూ ఇద్దరు కొడుకులని ఇచ్చి వెళ్ళాడు.అందులో అల్లరి నరేష్( Allari Naresh ) చాలా బాగా సక్సెస్ అయ్యాడు ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) వెనకబడ్డాడు.
అయితే సత్యనారాయణ కన్నుమూసిన తర్వాత అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చినప్పుడు ముగ్గురు కూర్చుని కొని నిర్ణయాలు చేసుకున్నారట వాటి ప్రకారమే ఇప్పటి వరకు వారు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారట.తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల గురించి జరుగుతున్న జీవితం గురించి అల్లరి నరేష్ ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని పంచుకున్నారు మరి ఆ విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లరి నరేష్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంటిని చూసుకునే బాధ్యతను ఇంటికి పెద్ద కొడుకు అయినా ఆర్యన్ రాజేష్ చేతిలో పెట్టారు అంట ఇవీవీ సత్యనారాయణ భార్య.నరేష్ కేవలం సంపాదిస్తాడు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ ( Invest ) చేయాలి అనే విషయం ఏమాత్రం తెలియదట డబ్బు గురించి అడిగితే తొందరగా కంగారు పడతా ఉంటారట.అందుకే అన్ని విషయాలు ఆర్యన్ రాజేష్ మాత్రమే దగ్గరుండి చూసుకుంటాడట.ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా లేదంటే ఇంటి ఖర్చులు చూసుకోవాలన్న, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్న, కారు కొనాలన్నా, ఫోన్ మార్చాలి అన్న కూడా ఆర్యన్ రాజేష్ సలహా లేకుండా నరేష్ ఏ పని చేయరట.
ఆర్యన్ రాజేష్ చాలా తెలివిగా బిజినెస్ ప్లాన్స్( Business Plans ) అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తారట.వస్తున్న డబ్బులు కూడా జాగ్రత్త చేస్తారట.తనకు ఏం కావాలన్నా ఎంత డబ్బు సంపాదించినా కూడా తన అన్నయ్య పర్మిషన్ లేకుండా ఎలాంటి పని చేయడట.ప్రస్తుతం సినిమాల్లో లేకపోయినా వ్యాపారాలు అలాగే ప్రాపర్టీస్ విషయంలో ఆర్యన్ రాజేష్ చాలా బాగా డీల్ చేస్తున్నాడు అంటూ చెబుతున్నారు అల్లరి నరేష్.
తనకు కూతురు ఉంది భార్య ఉన్నప్పటికీ కూడా అన్న చెప్పిన మాట జవదాటకుండా తల్లి మాటలు విలువనిచ్చి అల్లరి నరేష్ ఇంత మంచి జీవితాన్ని గడుపుతుండడం నిజంగా ఆశ్చర్యాన్ని ఇస్తుంది.