ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ప్రజలు భావించగా ఆ అంచనాలే ఎట్టకేలకు నిజమయ్యాయి.ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడంతో కూటమికి ఏపీలో తిరుగులేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్( TDP MLA Kolikipudi Srinivas ) మంచి మనస్సును చాటుకున్నారు.తిరువూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈ ఎమ్మెల్యే జీతం, అలవెన్స్ లు సీఎం సహాయనిధికే ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు వచ్చే జీతంతో పాటు ఇతర అలవెన్స్ లను ఏడాది పాటు సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని కొలికిపూడి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
తిరువూరు ఎమ్మెల్యే( Thiruvuru MLA ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పథకాల అమలు విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రకటించిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేలా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.ఏపీ రాబోయే ఐదేళ్లలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో చూడాల్సి ఉంది.ఈ ఎన్నికల్లో కొలికిపూడి శ్రీనివాసరావు 21,874 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
టీడీపీ పాలనలో చెప్పిన పథకాలన్నీ అమలైతే భవిష్యత్తులో సైతం ఏపీలో కూటమికే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.