సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు చిరంజీవి( Chiranjeevi ) ఇక సినిమాలపరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎక్కడ కూడా స్టార్ హీరో అనే గర్వం చూపించరు, ఎలాంటి వివాదాలకు కూడా వెళ్లరు.కానీ మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా విమర్శిస్తే తన తమ్ముళ్లు నాగబాబు ( Nagababu )పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాత్రం వారికి తమ స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఇలా మెగాస్టార్ పట్ల అందరికీ ఎంతో గౌరవం మర్యాదలు కూడా ఉన్నాయి.ఇక చిరంజీవి సంతానం ముగ్గురు అనే సంగతి మనకు తెలిసిందే.

చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రిని మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక సుస్మిత ( Susmitha ) సైతం ఇండస్ట్రీలో నిర్మాతగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.ఇక చిన్న కుమార్తె శ్రీజ గురించి చెప్పాల్సిన పనిలేదు.మీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు.ఇకపోతే తాజాగా నాగబాబు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుస్మిత అంటే తన ఇంట్లో వారందరూ కూడా భయపడతారని ఈయన వెల్లడించారు.ఆమె చాలా క్రమశిక్షణతో ఉంటారు.ఎవరైనా తప్పు చేస్తే అందరిని తిట్టేస్తారని, మమ్మల్ని కూడా కొన్నిసార్లు తిడుతుందని నాగబాబు తెలిపారు.
నిజానికి మేము మా నాన్న అంటే చాలా భయపడే వాళ్ళ కానీ మా నాన్న సుస్మితకు భయపడేవారు అంటూ నాగబాబు కామెంట్ చేశారు.సుస్మిత తన ఇంట్లో అన్ని ఆర్మీ రూల్స్ పాటిస్తారు.
తన పిల్లలని చాలా క్రమశిక్షణతో పెంచుతున్నారు.సుస్మిత అంటే మెగా ఫ్యామిలీ అందరికీ కాస్త భయమేనని నాగబాబు తెలిపారు.
సుస్మిత ఈ ఫీల్డ్ లో కాకుండా ఐపీఎస్ కనుక అయ్యి ఉంటే ఈమె అందరి తాట తీసేది అంటూ సుస్మిత గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.