పవన్ ప్రమాణ స్వీకారం.. సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఇక ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే.

 Renu Desai Special Post On Pawan Oath Ceremony Details, Renu Desai, Pawan Kalyan-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కుమారుడు కుమార్తె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్( Renu Desai ) సంతానం అయిన అకీరా( Akira ), ఆధ్య( Adhya ) ఇద్దరు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి తన కుమారుడు అకీరా తన వెంటే ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు కూడా తన కుమారుడిని వెంట తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారు.ఇక తన తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపించి సందడి చేశారు.అకీరా అయితే ఏకంగా పంచ కట్టి కనిపించడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సంతోషకరమైనటువంటి సమయంలో రేణు దేశాయ్ కూడా స్పందించారు.

పవన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు తన ఇద్దరు పిల్లలు తన తల్లికి వీడియో కాల్ చేశారు.ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు.

పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి, ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అన్నా లెజినోవా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె ఆ ఆనంద క్షణాలను తన సెల్ ఫోన్ లో బంధిస్తూ కనిపించారు.

ఇక పవన్ ప్రమాణ స్వీకారం చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube