వీడియో: స్వీట్‌షాప్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. తృటిలో తప్పించుకున్న యువతి..

ఇటీవల కాలంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల వాహనాలు ఇల్లు, ఆఫీసులు, దుకాణాల్లోకి(shops) దూసుకు వస్తున్నాయి.ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

 A Bus Rammed Into A Sweetshop.. A Young Woman Narrowly Escaped, Dindigul, Tamil-TeluguStop.com

తాజాగా తమిళనాడులోని దిండిగల్ సిటీలో ఇలాంటి షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.రీసెంట్‌గా టీఎన్ఎస్టీసీ (TNSTC) బస్సు ఒక స్వీట్‌ షాప్‌లోకి దూసుకెళ్లింది.

డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన సీసీటీవి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఆ వీడియో 7 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్ గా మారింది.

వీడియోలో బస్సు దుకాణాన్ని ఢీకొట్టడం, లోపల ఉన్న సేల్స్‌వుమన్‌ ఆ దెబ్బకు కింద పడటం కనిపిస్తుంది.బయట ఉన్న మహిళా కస్టమర్ (customer)‌ కొద్దిలో బస్సు నుంచి తప్పించుకోవడం కూడా చూడవచ్చు.చాలా వేగంగా పక్కకు తప్పుకోవడం వల్ల ఆమె ప్రాణంతో బయటపడగలిగింది.

ఈ వీడియో చూసిన చాలా మంది ఆ మహిళా కస్టమర్ బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నామని కామెంట్లు చేశారు.ప్రమాదం జరగకుండా వేగంగా పక్కకు తప్పుకున్న ఆమె పైగా చాలామంది ప్రశంసించారు.

కానీ దుకాణంలో ఉన్న సేల్స్‌వుమన్‌ గాయపడ్డారు.ఆమెకు చికిత్స అందించడానికి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

TNSTC ఒక ప్రకటన విడుదల చేసింది, ఈ ప్రమాదానికి డ్రైవర్ తప్పు కారణమని తెలిపింది.లోకల్ మీడియా ప్రకారం, డ్రైవర్ థేనికి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదు.ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు TNSTC తెలిపింది.రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం.ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు, వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఘటనలో, దుకాణం బయట ఉన్న మహిళ సత్వర స్పందన వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది.ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube