నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu Naidu ) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.ఇదే సమయంలో కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
మెగా మరియు నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.పలువురు కేంద్ర మంత్రులు కూడా రావటం జరిగింది.
ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు తన నివాసంలో మంత్రులుగా ఎన్నికైన వారితో సమావేశం నిర్వహించారు.ఈ బేటిలో పరిపాలనలో తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితి.ఆ తర్వాత నుంచి ఇప్పుడున్న పరిస్థితిని మంత్రులకు వివరించారు.మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తా అని చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది.ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చెప్పారు.
గత ప్రభుత్వంలో దారి తప్పిన వ్యవస్థలను మనం బాగు చేయాలని మంత్రులకు వివరించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి.
ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.వైసీపీ ప్రభుత్వం( YCP )లో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దు.
శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని చంద్రబాబు సూచించారు.