ఆ సినిమాను ఏకంగా 100సార్లు చూసిన సూపర్ స్టార్ మహేష్.. అంత ఇష్టమా?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు( Sudheer Babu ) గురించి మనందరికీ తెలిసిందే.సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) బావ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

 Hero Sudheer Babu Harom Hara Prerelease Event Details, Sudheer Babu, Haro Hara M-TeluguStop.com

ఇకపోతే సుధీర్ బాబు తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు సుధీర్ బాబు.

ఇకపోతే సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హరోం హర.( Harom Hara ) ఈ సినిమాకు జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Haro Hara, Harom Hara Pre, Sudheer Babu, Mahesh, Maheshbabu, Tollywood-Mo

ఈ సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు విశ్వక్సేన్, అడవి శేషులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ ఈవెంట్ లో భాగంగా హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ.

అడివి శేష్‌ నాకు స్ఫూర్తి.తన తలరాతను తానే రాసుకున్నాడు.

సినిమా కథల విషయంలో చాలా మంది అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేసుకుంటారు.ఈ రోజుల్లో ఒక హీరోకు మరో హీరో సపోర్ట్‌ చేసుకోవాలి.

ఏ సినిమా ప్రీరిలీజ్‌ అయినా విశ్వక్‌సేన్‌ హాజరవుతారు.అది తనలో ఉన్న గొప్ప లక్షణం.హరోంహరలో నేను సుబ్రహ్మణ్యం పాత్రలో కనిపిస్తాను.ఇది మంచి విజయం సాధిస్తుంది.

Telugu Haro Hara, Harom Hara Pre, Sudheer Babu, Mahesh, Maheshbabu, Tollywood-Mo

దీని కోసం చాలా మంది కష్టపడ్డారు అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.ఇక ఇదే ఈవెంట్‌లో మహేశ్‌ బాబుతో మాట్లాడిన ఫోన్‌ రికార్డును సుధీర్‌బాబు ప్లే చేశారు.అందులో సుధీర్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేశ్‌ సమాధానమిచ్చారు.సినిమాల్లో మొదటిసారి గన్స్‌ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది? అని సుధీర్ బాబు అడగగా మహేష్ బాబు మాట్లాడుతూ.గన్స్‌ ఉపయోగించడంపై నేను ప్రత్యేక శిక్షణేం తీసుకోలేదు.టక్కరి దొంగ మూవీలో ఎక్కువగా గన్స్‌ వాడాం.

ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం అని తెలిపారు.అలాగే గన్స్ ని చూపించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని ప్రశ్నించగా.

నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు.( Mosagallaku Mosagadu ) ఆ సినిమాను వందసార్లు చూసుంటాను.

నాకు చాలా ఇష్టమైన చిత్రమది అని తెలిపారు మహేష్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube