ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కన్నడ హీరో దర్శన్ ( Hero Darshan )గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.చెయ్యకూడని తప్పు చేసి జైలో చిప్ప కూడు తింటున్న దర్శన్ ని చూసి చాలామంది నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
కన్ను మిన్ను కానక తప్పు చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో దర్శన్ ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు.కన్నడ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎంతో పీక్ స్టేజ్ లో ఉన్న దర్శన్ చేజేతులారా జీవితాన్ని, కెరియర్ ను పోగొట్టుకోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
అది కూడా ఒక మహిళ కోసం ఇలా అన్ని త్యాగం చేసేవారు ఎవరుంటారు చెప్పండి.అందుకే జీవితంలో చేసే ప్రతి తప్పుకి ఒక శిక్ష ఉంటుంది.
భార్యను మోసం చేసి ప్రియురాలితో రిలేషన్షిప్ అనేది ఏ ఒక్కరికి సరైన విషయం కాదు అని దర్శన్ ని చూసిన ఇండస్ట్రీలోని చాలా మంది నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే దర్శన్ ఇలా రిలేషన్షిప్ లోకి వెళ్లడం ఇదేమి మొదటిసారి కాదు.గతంలో మన టాలీవుడ్ హీరోయిన్ అయినా నిఖిత( Nikhita ) తో కూడా చాలా రోజుల పాటు రిలేషన్ నడిపాడు.భర్తను ఎదిరించలేని దర్శన్ భార్య డైరెక్ట్ గా నిఖిత తోనే తేల్చుకుంది.
తనకు ఒక కొడుకు ఉన్నాడని, తన జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని, తన భర్తతో తిరగడం మానేయాలంటూ నిఖితకు స్ట్రాంగ్ డోస్ కూడా ఇచ్చిందట.నికిత కారణంగా దర్శన్ కి అలాగే ఆయన భార్య విజయలక్ష్మికి( Vijayalakshmi ) చాలా గొడవలు జరిగాయట.
ఆమెను గన్నుతో బెదిరించి చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట.

ఇక కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్( Film Producers Association ) దీనిపై సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరిపి నిఖితను మూడేళ్ల పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు.దాంతో భార్యాభర్తల మధ్యలో ఇరుక్కోవడం ఇష్టం లేని హీరోయిన్ నిఖిత మెల్లిగా దర్శన్ నుంచి సైడ్ అయిపోయింది.తనకు దర్శన్ కి కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్ప మరేమీ లేదు అంటూ బుకాయించే ప్రయత్నం చేసింది.
ఇదే క్రమంలో డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు కూడా విజయలక్ష్మి దర్శన్ పై పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.వందల మంది దర్శన్ ఫ్యాన్స్ రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేశారు.
తమ అభిమాన హీరోని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు ఏది ఏమైనా నిఖిత ఎపిసోడ్ చాలా మందికి అప్పట్లోనే పెద్ద గుణపాఠం అని చెప్పుకోవాలి.అయినా కూడా తీరు మారని దర్శన్ ఇప్పుడు ఏకంగా హత్య కేసులో జైలు పాలు అయ్యారు.