పోటెత్తిన వేలాది మంది ఫ్యాన్స్ .. ఆ మాట అనడంతో వెనదిరిగి వెళ్లిపోయారే..??

సాధారణంగా మూవీ షూటింగ్స్ ఇన్‌డోర్‌లోనే చేయడానికి మేకర్స్ ఇష్టపడతారు.పాతకాలంలోనూ షూటింగ్స్ అన్నీ స్టూడియోల్లోనే పూర్తి చేసేవారు.

 Ntr One Word Is Enough For Fans , Ntr, Jamuna, L. Vijayalakshmi, Ntr Producer-TeluguStop.com

ఇల్లు, ఆఫీసులు, ఆలయాలు వంటివి సెట్టింగ్స్ వేసేవారు.ఎందుకంటే అప్పట్లో ఔట్‌డోర్‌లో షూటింగ్ తీస్తే జనాలు పోటెత్తేవారు.

వారిని కంట్రోల్ చేయలేక పోలీస్ సిబ్బంది నానా తంటాలు పడేవారు, నటులు, సినిమా టెక్నీషియన్లు కూడా చాలా కష్టాలు పడేవారు.ఇన్ని సవాళ్లు ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సినిమాలకు ఔట్‌డోర్స్‌లో షూటింగ్ చేయాల్సి వచ్చేది.

ఈ సినిమాలు చిన్నవైతే పర్లేదు కానీ బడా నటీనటులు నటించే సినిమాలైతేనే జనాలతో పెద్ద చిక్కు వచ్చిపడేది.అలాంటి ఒక క్లిష్టమైన అనుభవాన్ని “రాముడు భీముడు” మూవీ టీమ్‌ ఫేస్ చేసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌, జమున, ఎల్‌.విజయలక్ష్మీ( NTR, Jamuna, L.Vijayalakshmi ) మెయిన్ రోల్స్‌ చేశారు.ఇదే డా.డి.రామానాయుడు నిర్మించిన ఫస్ట్ మూవీ కావడం విశేషం.ఆ మూవీ షూటింగ్‌లో ఉన్న సమయంలో ఒకసారి ఎన్టీఆర్‌ నాగార్జున సాగర్‌కు వెళ్లారు.అక్కడి ప్రాంతం ఆయనకు బాగా నచ్చేసింది.

అక్కడ రాముడు భీముడు( Ramudu bheemudu ) సినిమాలోని సన్నివేశాలను షూట్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ భావించారు.అదే విషయాన్ని రామానాయుడి చెవిన పడేసారు.రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి కదా, ఇక్కడే షూట్ చేస్తే బాగుంటుంది కదా అని రామారావు అన్నారట.“మీకు ఆ ప్లేస్ నచ్చితే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, బ్రదర్.” అంటూ రామానాయుడు ఎన్టీఆర్ కి రిప్లై ఇచ్చారట.ఈ విషయాన్ని రామానాయుడు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

Telugu Jamuna, Vijayalakshmi, Ntr Word Fans, Ntr-Telugu Top Posts

నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎన్టీఆర్( NTR ) అక్కడే ఓ పాట చేయడానికి సిద్ధమైపోయారు.ఈ సినిమా షూట్ చేసే నాటికి నాగార్జున సాగర్‌ ఇంకా కన్స్ట్రక్షన్‌లోనే ఉంది.అయినా అప్పటికే అక్కడ కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి.కానీ ప్రజలు ఎక్కువగా అక్కడికి రావడం వల్ల, వారి గోల తట్టుకోలేక కొన్ని సినిమాలు షూటింగ్ మానుకొని అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోయాయి.

ఇందులో డాక్టర్ చక్రవర్తి సినిమా ఒకటి.ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు పోలీసులను కాంటాక్ట్ అయి ప్రజలను కంట్రోల్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.అయితే ఆ జనాలను కంట్రోల్ చేయడం మా వల్ల కాదని పోలీసులు చేతులెత్తేశారు.రామానాయుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు ఎన్టీఆర్.

Telugu Jamuna, Vijayalakshmi, Ntr Word Fans, Ntr-Telugu Top Posts

కానీ ఆయనలో ఎలాంటి బాధా కనిపించలేదు.పోలీసులు లేకపోతే ఏంటి బ్రదర్ జనాల సంగతి నేను చూసుకుంటాను అంటూ సినిమా యూనిట్‌ను నాగార్జునసాగర్ వద్దకు తీసుకెళ్లారు.ఈ విషయం తెలిసి ప్రజలు ఎప్పటిలాగానే వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.వేలాదిమంది అక్కడికి వచ్చాక ఎన్టీఆర్ నిర్మాత, హీరోయిన్‌తో కలిసి వారి ముందుకి వచ్చారు.తనతో పాటు నిర్మాత, హీరోయిన్ చేత ప్రజలకు నమస్కారం చేయించారు.

ఆ తర్వాత “అందరికీ నమస్కారం.

మమ్మల్ని చూడాలని వచ్చారు.చూశారు.

మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా క్షేమమే కదా.మీరు వెనక్కి జరిగి మాకు సహకరిస్తే మా పని చేసుకుంటాం.’ అని చాలా మర్యాదపూర్వకంగా జనాలకు విజ్ఞప్తి చేశారు.ఎన్టీఆర్ నుంచి ఆ మాటలు వినగానే ప్రజలంతా సైలెంట్ అయిపోయారు, అంతేకాదు మూవీ టీమ్‌కు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో మూవీ టీమ్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘దేశమ్ము మారిందోయ్‌.కాలమ్ము మారిందోయ్‌.’ అనే పాటను షూట్ చేసింది.అలా ఎన్టీఆర్ చెప్పిన ఒక్క మాట వల్ల పోలీసులు సహాయం లేకుండానే రెండు రోజులు పాటు ఇక్కడ రాముడు భీముడు మూవీ షూటింగ్ జరుపుకోగలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube