మామిడి-ముల్తాని మ‌ట్టితో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఆ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌న్నీ దూరం!

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌లో మామిడి ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.రుచి ప‌రంగానే కాదు.

 Wonderful Face Pack With Mango And Multani Mitti Details! Face Pack, Mango, Mult-TeluguStop.com

పోష‌కాల ప‌రంగానూ మామిడి పండు రారాజే అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మామిడి పండు.

చ‌ర్మ సౌంద‌ర్యానీ పెంపొందిస్తుంది.ముఖ్యంగా మామిడి, ముల్తాని మ‌ట్టి క‌లిపి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే.

వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మామిడి పండు, ముల్తాని మ‌ట్టితో ఫేస్ ప్యాక్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

మొద‌ట దోర‌గా పండిన‌ మామిడి పండును తీసుకుని తొక్క తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తాని మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల మామిడి పండు పేస్ట్‌, నాలుగు టేబుల్ స్పూన్ల బాదం పాలు, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకుంటే ప్యాక్ సిద్ధ‌మైన‌ట్లే.

Telugu Badam Milk, Tips, Face Pack, Latest, Mango, Multani Mitti, Oats Powder, S

ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో కాస్త మందంగా ముఖానికి, కావాలి అనుకుంటే మెడ‌కు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.మూడు రోజుల‌కు ఒక‌సారి ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

చ‌ర్మంపై మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు క్ర‌మంగా దూరం అవుతాయి.ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.మ‌రియు చ‌ర్మం మునుప‌టి కంటే ఎక్కువ కాంతివంతంగా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube