విక్రమ్ ఓటీటీలో విడుదలయ్యేది అప్పుడేనా?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్.ఈ సినిమా వివిధ భాషలలో జూన్ మూడవ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.

 Will Vikram Movie Will Be Released In Ott Then , Vikram, Tollywood, Kamal Hasaan-TeluguStop.com

చాలా కాలం తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా థియేటర్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకొని థియేటర్లలో విపరీతంగా ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఈ మధ్యకాలంలో థియేటర్ అన్ని పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్క సినిమా కూడా ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీ విడుదలైన విక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ల సొంతం చేసుకున్నారు.

అదే విధంగా ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేశారు.లేకపోతే థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు ప్రసారం అవుతుంది అనే విషయానికి వస్తే.

Telugu Kamal Hasaan, Ott, Telugu, Tollywood, Vikram-Movie

సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆరు వారాలకు ఓటీటీలో ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో ఓటీటీలో ప్రసారం అవుతుందని తెలుస్తోంది.ఇక తెలుగులో ఈ సినిమాని నితిన్ తన సొంత బ్యానర్ ద్వారా థియేటర్లో విడుదల చేశారు.తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించగా మరొక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో సందడి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube