అప్పుడప్పుడు సోషల్ మీడియాలో( Social Media ) జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇందులో అడవులలో నివసించే వన్యమృగాలకు సంబంధిత వీడియోలు ఎక్కువగా కనబడతాయి.
అయితే తాజాగా ఓ కోడిపుంజుకు( Rooster ) సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయినప్పుడు మూగ జీవాలపై తమ పైశాచికత్వం ప్రదర్శిస్తుంటారు.
ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు కూడా చూసే ఉంటాం.తాజాగా ఓ యువతి సరిగ్గా ఇలాగే చేసింది.
ఓ కోడిపుంజును దారుణంగా టార్చర్ పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇకపోతే వీడియోలో కనిపించిన దాని ప్రకారం., ఓ యువతి( Woman ) కోడి పుంజుపై అనేక మార్లు రెచ్చిపోయింది.తొలుత చేతితో కొన్నిసార్లు సార్లు దాని తలపై కొట్టింది.
దాంతో కోడికి తిక్కరేగేలా చేసి తనపై దాడి చేసే పరిస్థితి తెచ్చింది.అక్కడి నుంచి మరింతగా రెచ్చిపోయింది.
ఇక ఈ పరిస్థితులలో కోడి ఒక్కసారిగా గాల్లోకి ఎగరగానే దాని పీక పట్టుకుని పలుమార్లు తలపై కొట్టింది మహిళ.ఆపై దాన్ని దూరంగా విసిరేసింది.
ఆ తరువాత మళ్లీ కోడిని దొరకపుచ్చుకుని గిర గిర తిప్పి నేలకేసి కొట్టింది.ఆ దెబ్బతో ఆ కోడిపుంజు నరకం చూసింది.ఇకపోతే, కోడిపుంజును అంతగా హింసించడానికి కారణాలేంటో మాత్రం తెలియరాలేదు.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు మాత్రం ఆ మహిళపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నువ్వు అసలు మనిషివేనా.? అంటూ కొందరు ప్రస్తావిస్తుండగా.మరికొందరేమో నిన్ను కూడా చాలా ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో అనుభవం చేస్తే తెలుస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో( Viral Video ) ఒకసారి వీక్షించండి.