సురేఖావాణి పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా.. ఫోటో దిగాలంటే లక్షలు ఇవ్వాలా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి( Surekha Vani) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి.

 Actress Surekha Vani Clicked With Orry Awatramani In A Recent Party Photos Goes-TeluguStop.com

నటిగా లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖ.

సహాయ నటిగా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించింది.ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ తో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Telugu Bollywood, Orry Awatramani, Surekha Vani-Movie

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోలను, విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇకపోతే ఆ మధ్యన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సురేఖా వాణి పేరు వినిపించిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి తాజాగా ఇన్ స్టాలో ఒక ఫొటో షేర్ చేసింది.అందులో బాలీవుడ్( Bollywood ) ఫేమస్ స్టార్ ఓరీ అవ్రతమణితో కలిసి పోజులిచ్చింది.

అయితే ఓరీ గురించి తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు.దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సురేఖా వాణితో అంత క్లోజ్ గా ఉన్నాడు ఎవరబ్బా అంటూ అతని గురించి ఆరా తీస్తున్నారు.

Telugu Bollywood, Orry Awatramani, Surekha Vani-Movie

ఓరీ అవత్రమని( Orry Awatramani ).సింపుల్‌గా ఓరీ అని పిలుస్తుంటారు.తెలుగు జనాలకు ఇతని గురించి పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం ఇతను చాలా ఫేమస్.ముఖ్యంగా స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, ఆర్యన్ ఖాన్,, నైసా దేవగన్, అనన్య పాండే ఇలా వీళ్లందరికీ ఓరీ బెస్ట్ ఫ్రెండ్.

ఇక బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా ఓరీ ఉండాల్సిందే.ఇక ఓరీతో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని అతనే ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.ఓరీ ఇంతగా ఫేమస్ అవ్వడానికి అతను ఏం చేస్తుంటాడని అందరి ప్రశ్న.ఓరీ ఒక ఫ్యాషన్ డిజైనర్ కమ్ ఈవెంట్ మేనేజర్ కూడా.

మరి సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు మాత్రం తెలియడం లేదు.హైదరాబాద్ లేదా ముంబయిలో జరిగిన ఒక పార్టీలో వీరిద్దరు కలిసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube