ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబుతో పాటు, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మరో మంత్రి పదవి చంద్రబాబు క్యాబినెట్ లో ఖాళీగా ఉంది .పొత్తులో భాగంగా జనసేన నుంచి ముగ్గురికి , బిజెపి నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ ( Pawan Kalyan, Nadendla Manohar, Kandula Durgesh )లకు అవకాశం లభించింది.
బిజెపి నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ కు అవకాశం కల్పించారు.మరో మంత్రి పదవి ఖాళీగా ఉంచారు.దీంతో ఖాళీగా ఉంచిన ఆ మంత్రి పదవిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఆ ఖాళీగా ఉన్న స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది.అదే గనుక జరిగితే జనసేన నుంచి సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు ( Konatala Ramakrishna )అవకాశం దొరుకుతుందని అంతా అంచనా వేస్తున్నారు .అయితే ఖాళీగా ఉన్న ఆ స్థానంపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది.చంద్రబాబు క్యాబినెట్ బిజెపి రెండు స్థానాలు కోరినట్టు ప్రచారం జరిగింది.అయితే ఒక స్థానాన్ని మాత్రమే బిజెపికి కేటాయించారు.నిన్న చంద్రబాబుతో అమిత్ షా భేటీ అయ్యి చర్చలు జరిపారు.బిజెపి నుంచి సృజన చౌదరి , ఆదినారాయణ రెడ్డి , కామినేని శ్రీనివాస్ ( Srijana Chaudhary, Adinarayana Reddy, Kamineni Srinivas )పేర్లు వినిపించాయి.
సృజన చౌదరికి ఇవ్వాలంటే కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు .
గొట్టిపాటి రవికుమార్ , నాదెండ్ల మనోహర్ లు ఉన్నారు.మరొకరికి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి , బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాదరెడ్డికి ఇచ్చారు మరో రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
జనసేన కమ్మ , కాపులకు మాత్రమే మూడు మంత్రి పదవులు ఇవ్వడంతో, ఎస్సీ లకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.అయితే అటు బిజెపి, ఇటు జనసేన నుంచి మంత్రి పదవి విషయంలో ఒత్తిడి వస్తూ ఉండడంతో, ఆ రెండు పార్టీ లను కాదని టిడిపి కి చెందిన వారికే ఆ మంత్రి పదవి కేటాయిస్తారా అనేది చంద్రబాబు నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.