ఏడుగురు దొంగలతో ఫైట్ చేసిన సింగిల్ పోలీస్.. రూ.4 కోట్లు రికవర్?

సాధారణంగా పోలీసులలో చాలా ధైర్యవంతులు ఉంటారు.ప్రాణాలకు రిస్కుందని తెలిసినా కూడా వారు ప్రజల శ్రేయస్సు కోసం ముందడుగు వేస్తుంటారు.

 Video Viral Brave Bengal Cop Vs Masked Robbers In Gun Battle At Jewellery Shop D-TeluguStop.com

ఇటీవల ఓ పోలీసు అధికారి పశ్చిమ బెంగాల్‌లోని( West Bengal ) రాణిగంజ్ లో ఏడుగురు దొంగల ముఠాతో( Seven Thieves ) సింగిల్ హ్యాండెడ్‌గా ఫైట్ చేశారు.ఆదివారం మధ్యాహ్నం, ముసుగులు ధరించి, ఆయుధాలు కలిగి ఉన్న దొంగలు ఒక ప్రముఖ నగల దుకాణంపై( Jewellery Shop ) దాడి చేశారు.వాళ్లు అక్కడ ఉన్న వారందరికీ షేక్ ఇస్తూ వారు అక్షరాలా రూ.4 కోట్లకు పైగా విలువైన నగలను దోచుకున్నారు.

ఆ సమయంలో విధి నిర్వహణలో లేని, సాధారణ దుస్తులు ధరించిన సబ్-ఇన్‌స్పెక్టర్ మేఘనాథ్ మండల్( Sub-Inspector Meghnad Mondal ) ఈ దోపిడీని గమనించారు.ఒక విద్యుత్ స్తంభం వెనుక దాక్కుని, తన తుపాకీతో దొంగలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యాడు.

బయలుదేరబోయే దొంగలు మండల్ ను చూశారు.దీంతో సుమారు అర నిమిషం పాటు తుపాకీ పోరాటం జరిగింది.

ఒంటరిగా ఉన్నప్పటికీ, దొంగల కంటే తక్కువ ఆయుధాలు ఉన్నప్పటికీ, మండల్ ధైర్యంగా పోరాడారు.అతని ధైర్యం వల్ల దొంగలు పారిపోయారు.

దొంగల ముఠాపై ధైర్యంగా పోరాడిన పోలీసు అధికారి మేఘనాథ్ మండల్ దొంగలలో ఇద్దరిని పట్టుకున్నారు.ఆదివారం మధ్యాహ్నం జరిగిన దోపిడీ తర్వాత, దొంగలు రూ.2.5 కోట్ల విలువైన నగలు, ఒక మోటార్ సైకిల్, రెండు బ్యాగులు, అనేక తుపాకీ గుళ్లను వదిలి పారిపోయారు.

మండల్ వెంటాడి, బ్యాకప్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.పశ్చిమ బెంగాల్, పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ పోలీసులు కలిసి దొంగలను గాలించడం ప్రారంభించారు.ఒక దొంగను జార్ఖండ్ లో, మరొకరిని బీహార్ లో పట్టుకున్నారు.ప్రజలు అతనిని హీరో అని పిలుస్తున్నప్పటికీ, అధికారి మండల్ తాను కేవలం తన విధిని నిర్వహించానని చెప్పారు.

మిగిలిన దొంగలు, కనిపించని నగల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.వారు త్వరలోనే వారిని పట్టుకుని అన్ని దొంగిలించిన వస్తువులను తిరిగి పొందుతారని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube