తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) బుధవారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమం కేసరపల్లిలో ఐటీ టవర్ వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు మెగాస్టార్ చిరంజీవి మరియు నారా అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కావటంతో కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు.గత ఐదు సంవత్సరాలు పార్టీని ముందుకు నడిపించడం కోసం ఎన్నో పోరాటాలు చేసి చారిత్రత్మకమైన విజయాన్ని అందుకోవటంతో.
ప్రమాణ స్వీకారం సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna)తన సోదరి భువనేశ్వరిని( Nara Bhuvaneshwari) ఆశీర్వదించటం జరిగింది.ఈ వీడియోని నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.“ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో… నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.థాంక్స్ బాలా అన్నయ్య” అని పోస్ట్ చేయడం జరిగింది.చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో నారా భువనేశ్వరి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు.చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో మరణించిన తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించారు.“నిజం గెలవాలి( Nijam Gelavali )” అంటూ.కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.కష్టాలలో భర్తకి అండగా ఉండి.తన శక్తికి మించి పార్టీ కోసం నారా భువనేశ్వరి కష్టపడ్డారు.దీంతో జరిగిన ఎన్నికలలో పార్టీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో చాలా సంతోషంగా ఉన్నారు.