స్టార్ హీరో బన్నీకి భారీ షాక్.. సాయితేజ్ అన్ ఫాలో చేయడానికి కారణాలివేనా?

ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే.ఆ సమస్యలను అంతకంతకూ పెంచుకుంటే సమస్యలు తప్పవు.

 Mega Hero Saitej Huge Shock To Bunny Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ( YCP ) అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వల్ల మెగా ఫ్యామిలీకి శత్రువు అయ్యాడు.నాగబాబు బన్నీ పరాయివాడు అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం అయింది.

Telugu Allu Arjun, Janasena, Pawan Kalyan, Pushpa, Sai Dharam Tej, Sneha Reddy,

అయితే జనసేన గెలిచిన తర్వాత అల్లు అర్జున్ పవన్ కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.బన్నీ ట్వీట్ తో సమస్య సద్దుమణిగినట్టేనని అందరూ భావించినా ఎవరూ ఊహించని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.మెగా మేనల్లుడు సాయితేజ్( Sai Dharam Tej ) సోషల్ మీడియాలో బన్నీ, స్నేహారెడ్డిని అన్ ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.అల్లు శిరీష్ ను మాత్రం సాయితేజ్ ఫాలో అవుతున్నారు.

Telugu Allu Arjun, Janasena, Pawan Kalyan, Pushpa, Sai Dharam Tej, Sneha Reddy,

అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతోందని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది.అయితే అల్లు హీరోను అన్ ఫాలో చేయడం గురించి సాయితేజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడమే సాయితేజ్ కోపానికి కారణమని భోగట్టా.పవన్( Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేసిన రోజే సాయితేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం కొసమెరుపు.

ఈ ఘటనల గురించి భవిష్యత్తులో బన్నీ నోరు విప్పుతారేమో చూడాల్సి ఉంది.బన్నీని టార్గెట్ చేయడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ పుష్ప ది రూల్ చెప్పిన సమయానికి రిలీజ్ కావడం కష్టమనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బన్నీ మాత్రం ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube