మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్( Varun Tej ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు హీరో వరుణ్ తేజ్.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఆ సంగతి పక్కన పెడితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కాలికి చిన్నపాటి గాయం అవ్వడం శస్త్ర చికిత్స జరిగింది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.
ఆ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో వరుణ్ తేజ స్పందిస్తూ ఆ వార్తలు నిజం కాదు అంటూ వాటిని కొట్టి పడేసాడు.

తనకు మెడ నొప్పి మాత్రమే ఉందని కానీ కాలికి శస్త్ర చికిత్స జరిగిందన్న ప్రచారం ఎలా పుట్టుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు వరుణ్ తేజ్.అయితే ఇంతలోనే మరో వార్త పుట్టుకొచ్చింది.అదేమిటంటే మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్యామణి లావణ్య త్రిపాఠి కాలి గాయానికి చికిత్స జరిగిందని చెబుతున్నారు.
తన కాలికి కట్టు కట్టి ఉండడంతో ఈ ప్రచారం మొదలైంది.కాలి గాయం వల్లనే తాజాగా జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లావణ్య హాజరు కాలేదని ప్రచారం సాగుతోంది.

తన కుడి కాలికి గాయమైందని, కోలుకుంటున్నానని లావణ్య స్వయంగా సోషల్ మీడియాల్లో వెల్లడించడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది.కాలి గాయానికి సంబంధించిన లావణ్య షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజాగా జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒక ప్రైవేట్ బస్సులో చేరుకున్న విషయం తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రామ్ చరణ్ ఉపాసన సుస్మిత చిరంజీవి ఆయన భార్య నాగబాబు ఆయన భార్య ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.







