రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్,పుస్తకాల పంపిణీ అమ్మ ఆదర్శ చైర్మన్ పీసరి మంజుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రభుత్వం అందించిన యూనిఫామ్ పుస్తకాలను మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
విద్యార్థులు( students ) మంచి చక్కని చదువు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘుపతిరావు, శ్రీనివాస్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు జ్యోతి, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.







