మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న బాలయ్య, రవితేజ.. ఈసారి ఎవరు గెలుస్తారో?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు ( Balakrishna )ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు.సినిమాల పరంగా అటు రాజకీయపరంగా మంచి సక్సెస్ లు సాధిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

 Once Again Balayya And Raviteja Clash Is On, Clash, Ravi Teja, Balakrishna , To-TeluguStop.com

ఇకపోతే బాలయ్య బాబు వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం బాలయ్య బాబు బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని నందమూరి అభిమానులు చెబుతున్నారు.ఆ సంగతి పక్కన పెడితే మరొకవైపు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం హరి శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నారు రవితేజ( Ravi Teja).

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ కి సిద్ధం కాబోతున్నాయి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే గతంలో బాలయ్య బాబు రవితేజ చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన విషయం తెలిసిందే.గత ఏడాది బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల సమయంలోనే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలైన విషయం తెలిసిందే.టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా బాలయ్య బాబు మూవీ సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఈ ఏడాదిలో ఈ సెప్టెంబర్ 27న మరోసారి ఇద్దరి సినిమాలు రానున్నట్టుగా వినిపిస్తోందీ.

మరి ఈసారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube