మంచిర్యాల జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.కాసిపేట మండలం పెద్ద ధర్మారం శివారులో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మేకపై దాడి చేసి చంపేసింది.అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత పులిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
అధికారులు కెమెరాలు ఏర్పాటు చేసిన పది నిమిషాల్లోని ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత మేకను లాక్కెళ్లినట్లు సీసీ టీవీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.