సెకండ్ టెస్ట్: బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. ఇరు జట్లలలో ఏఏ మార్పులంటే..?!

శనివారం రోజు చెన్నై లో ఎమ్.ఎ చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది.

 England Vs India Second Test Match Teams Changes In Chennai, Indian Team, Englan-TeluguStop.com

ఈసారి స్టేడియంలోకి అడుగుపెట్టడానికి క్రికెట్ అభిమానులకు అనుమతి కూడా లభించింది.ఇంగ్లాండ్ టీం తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోవడానికి కారణం టాస్ ఓడిపోవమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ లో అదృష్టవశాత్తూ భారత్ టాస్ గెలిచింది.దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడం వలన తమ టీం కి కలిసొస్తుందని విరాట్ కోహ్లీ చెబుతున్నారు.

అలాగే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం తమ టీం లో ముగ్గురు క్రికెటర్లను మార్చామని ఆయన వెల్లడించారు.

ఈసారి జస్ప్రీత్ బూమ్రా కి విశ్రాంతి కల్పించి ఆయన స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేసుకున్నారు.వాషింగ్టన్ సుందర్ ప్లేసు ని అక్షర్ పటేల్ భర్తీ చేయగా .నదీమ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చారు.

Telugu Cheenai, England, Indian, Teams, Virat Kohili-Latest News - Telugu

అయితే తాము టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ జో రూట్ చెప్పుకొచ్చారు.విదేశాలలో వరుసగా ఆరు టెస్టు మ్యాచుల్లో గెలవడానికి ముఖ్య కారణం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే అని అన్నారు.అయితే ఇంగ్లాండ్ టీం రెండో టెస్టు మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది.

పేసర్ జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్‌, డోమ్ బెస్, జేమ్స్ ఆండర్సన్ లను టీమ్ ఇంగ్లాండ్ తీసేసి వారి స్థానంలో బెన్ ఫోక్స్, స్టువర్ట్ బ్రాడ్, ఆలీ స్టోన్, మొయిన్ లను ఎంపిక చేసింది.

ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, భారత్ తరఫున ఆడే మొత్తం ఆటగాళ్ల గురించి తెలుసుకుంటే…

భారత్: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్య రహానె, రిషబ్ పంత్ (డబ్ల్యూ), ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్: డోమ్ సిబ్లీ, రోరే బర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్ (సి), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ స్టోన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube