వారి బలవంతంతోనే ట్విట్టర్ కొన్నా.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి: మస్క్ ఫైర్!

ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్( Elon Musk ) తాజాగా వాచ్‌టెల్ ( Wachtell )అనే న్యాయ సంస్థపై దావా వేశారు.గతంలో మస్క్‌కి చెందిన కంపెనీ ఎక్స్‌ కార్ప్ ( X Corp ) 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పుకోలేదు.

 If Twitter Is Bought By Their Force Return That Money Musk Fire!, Elon Musk, Twi-TeluguStop.com

ఈ విక్రయాన్ని రద్దు చేయాలనుకుంది.అయితే రద్దు చేయడానికి మస్క్ చేసిన ప్రయత్నాన్ని విఫలం చేయడంలో వాచ్‌టెల్ న్యాయ సంస్థ( Wachtel Law Firm ) చాలా కృషి చేసింది.

చివరికి ఆ విషయంలో సఫలం అయింది.ట్విట్టర్ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన వాచ్‌టెల్‌కి 90 మిలియన్లు ముట్టగా.

ట్విట్టర్ ఇప్పుడు అందులో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందాలనుకుంటోంది.

ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఫీజులు చెల్లిస్తామని చెప్పడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాచ్‌టెల్ లాభపడిందని మస్క్ అభిప్రాయపడ్డారు.వాచ్‌టెల్ చేసిన పనికి 90 మిలియన్ డాలర్లు ఇవ్వడం చాలా ఎక్కువ అని మస్క్ భావించారు.మస్క్ వాచ్‌టెల్ వసూలు చేసిన ఫీజు తిరిగి పొందాలనుకుంటున్నారు.

వాచ్‌టెల్ భాగస్వాములలో ఒకరు, ట్విట్టర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఎక్స్‌ట్రా ఫీజు వసూలు చేయడానికి దానిని అనుమతించారని మస్క్ అన్నారు.వాచ్‌టెల్ మస్క్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

మస్క్ వ్యాజ్యంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని( San Francisco ) కోర్టులో విచారణ జరుగుతోంది.

ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మస్క్ ఇతర చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నాడు.మరోవైపు కొత్త యాప్‌ థ్రెడ్స్ ఐపీ హక్కులను ఉల్లంఘించినందున మెటా అనే మరో కంపెనీపై దావా వేస్తామని మస్క్ బెదిరించారు.మొత్తం మీద మస్క్ చాలా చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube