బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మధ్య టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ భామ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈమె ముందుగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఇక్కడ పరిచయం అయ్యింది.బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేసి అందరిని ఆకట్టు కుంది.
ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ లో కూడా స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో చిందేసింది.ఇక నిన్నటికి నిన్న మరో ఇద్దరు మెగా హీరోలతో అమ్మడు ఆడిపాడింది.
పవన్, సాయి తేజ బ్రో సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తుంది.పవన్, తేజ్ ఇద్దరు కలిసి మాస్ బీట్ సాంగ్ లో కనిపించగా అమ్మడు కూడా స్టెప్పులు వేసి సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ సాంగ్ ను నిన్న మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేసారు.

సాయి తేజ్, పవన్, ఊర్వశి కనిపించిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసింది.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
ఈ స్వీట్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తుంది.అందుకు కారణం ఈ పిక్ లో పవర్ స్టార్ లుక్స్ అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ఈ పిక్ లో కాస్త గడ్డంతో కనిపిస్తున్నారు.అలాగే ఈయన లుక్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది.బహుశా ఇది బ్రో సాంగ్ చిత్రీకరణ సమయంలో తీసుకున్న సెల్ఫీ అయిఉండవచ్చు.ఇక ఈమె ఈ పిక్ షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ కు మిమ్మల్ని స్వాగతిస్తున్నాం.
మా బ్రో సినిమా జులై 28న రిలీజ్ అవుతుంది అంటూ ఈమె షేర్ చేసిన పిక్ నెట్టింట సంచలనంగా మారింది.







