ఎంతో కస్టపడి మేకప్ వేసుకుంటూ ఉంటాం.ఆ మేకప్ ఎక్కువసేపు లేకపోతే ముఖం అందవిహీనంగా కనపడుతుంది.
ముఖం మీద మేకప్ ఎక్కువసేపు ఉండకపోవటానికి చర్మ తత్త్వం, కాలుష్యం,కొన్ని రకాల కాస్మొటిక్స్ వంటివి కారణాలుగా చెప్పవచ్చు.ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
మేకప్ వేసుకోవటానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన ముఖం మీద మలినాలు తొలగిపోయి మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది
మాయిశ్చరైజ్ రాయటం అనేది మేకప్ ఎక్కువగా నిలవటానికి పునాదిలా ఉంటుంది.మాయిశ్చరైజ్ రాయటం వలన ముఖ చర్మం పొడి పొడిగా లేకుండా ఉంటుంది
ప్రైమర్ రాయటం వలన కూడా మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.ప్రైమర్ అనేది ఫౌండేషన్ కి బేస్ గా ఉపయోగపడుతుంది
సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్ ను ఉపయోగిస్తే చర్మ రంద్రాలను మూయటానికి సహాయపడుతుంది.
పొడి చర్మం వారికి చర్మంను తేమగా ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది.ఫౌండేషన్ అనేది పిగ్మెంటేషన్ మరియు నల్లని మచ్చలు కనపడకుండా చేయటానికి కూడా సహాయపడుతుంది
మంచి నాణ్యత కలిగిన పౌడర్ ని వాడాలి.
ముఖానికి పౌడర్ ని బ్రష్ సాయంతో అప్ప్లై చేయాలి
మేకప్ కి సంబందించిన అన్ని రకాల ఉత్పత్తులను వాటర్ ప్రూఫ్ వాడటం చాలా ఉత్తమం.వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులను వాడటం వలన టచ్ అప్స్ ఇచ్చే అవసరం ఉండదు.