తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ( Andrapradesh ) రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.ఓవైపు చంద్రబాబు మరోవైపు జనసేన ఇంకోవైపు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందేందుకు ముందుకు వెళ్తున్నారు.
ఈ తరుణంలోనే వైసిపి పార్టీ నాయకులు కొడాలి నాని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) పై షాకింగ్ కామెంట్స్ చేశారు.మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు అనేది ఉందని, అవసరాలకు వాడుకోవడం తర్వాత తిప్పి విసిరేయడం అంటూ తీవ్రంగా కామెంట్స్ చేశారు.
ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీ పెడితే ఆయన్ని కూడా వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీ తన చేతిలోకి తీసుకున్నారని ,ఈయన బుద్ధి అప్పుడే బయటపడిందని అన్నారు.అంతటి మహోన్నత నేత ఎన్టీ రామారావు ( NT Ramarao ) గారిని పార్టీ నుంచి బయటకు నెట్టినటువంటి చంద్రబాబును నమ్మి ఆయనతో కలిస్తే మాత్రం నీకు కూడా వెన్నుపోటు పొడవడం ఖాయం పవన్ కళ్యాణ్ అంటూ హెచ్చరించారు.రాజకీయాలు చేసుకో నీ ఇష్టం ఉన్నప్పుడు ప్రజల మధ్యలో తిరుగు మాకు అభ్యంతరం లేదు.
కానీ వెన్నుపోటుదారులతో కలిసి పోతే మాత్రం నీకు తప్పకుండా వెన్నుపోటు పొడుస్తాడని తెలియజేశారు.నువ్వు జగన్మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) పై విమర్శలు చేయి , ఆయన చేసే తప్పులు ఏమన్నా ఉంటే ఎత్తి చూపించు .మాకు అభ్యంతరం లేదు.కానీ చంద్రబాబు లాంటి వ్యక్తులతో కలిసి మా మీద దాడి చేస్తా అంటే ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ అంటూ తెలియజేశారు.
దయచేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగలను నీ పక్కన పెట్టుకోకుండా సొంతంగా రాజకీయాలు చేసుకో అడ్డుకునే వారు ఎవరూ లేరు అంటూ మాట్లాడారు.ఒకవేళ మీ ఇద్దరూ కలిసి వస్తే మాత్రం మేము చంద్రబాబు ( Chandrabbau ) ని ఏ విధంగా చూస్తామో పవన్ కళ్యాణ్ ని కూడా ఆ విధంగానే చూస్తామంటూ జనసేనానికి చురకలంటించారు.కానీ వాళ్లతో కలిసి వాళ్ళ స్క్రిప్టులను అమలు చేస్తాను అంటే మాత్రం నిన్ను చంద్రబాబులాగానే చూస్తామని, ఆయనకు మద్దతు ఇవ్వకుండా సొంతంగా రాజకీయాలు చేసుకోవాలని హెచ్చరించారు.ఒకవేళ చంద్రబాబుతో కలిసి వస్తాను అంటే మాత్రం రోడ్డుపై బట్టలూడదీసి నిలబెడతామని షాకింగ్ కామెంట్స్ చేశారు.