పసుపు పంట( Turmeric Crop )కు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.ఎందుకంటే పసుపును వంటకాలలో పాటు వివిధ రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
కాబట్టి పసుపు పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు అర్జించవచ్చు.పసుపు పంటను ఆరంభం నుంచే సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు చేస్తే కాస్త పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది.
అధిక ప్రాధాన్యం కేవలం సేంద్రీయ ఎరువులకు మాత్రమే ఇవ్వాలి.ఒక ఎకరాకు బాగా మాగిన 12 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) వేసి పొలాన్ని కలియదులుకోవాలి.
పశువుల ఎరువు వేయలేక పోతే 200 కిలోల వేపపిండి, కానుగ పిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
పసుపు దుంపలు( Turmeric Harvest ) నాటుకున్న నెల రోజుల తర్వాత ఒక ఎకరం పొలంలో 50 కిలోల యూరియా, 200 కిలోల వేపపిండి కలిపి వేసుకోవాలి.ఇక నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే నాటుకోవాలి.ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్ ను కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాల పాటు పసుపు దుంపలను ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి.
ఇక ఏ పంటకైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు( Weeds ) ఆశించి వ్యాప్తి చెందడానికి కలుపు మొక్కలే ఎక్కువగా అతిధి మొక్కలుగా వ్యవహరిస్తాయి.కాబట్టి విత్తనం విత్తిన 24 గంటల వ్యవధిలో ఒక లీడర్ నీటిలో మూడు గ్రాముల అట్రాజిన్( Atrazin ) ను కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.విత్తిన వారం రోజులకు పండ్ల గోరుతో పైపాటుగా తిప్పాలి.ఇక పసుపు పంటను ఆశించే తాటాకు తెగుళ్లను అరికట్టాలంటే.ఒక లీడర్ నీటిలో 1.5 గ్రాముల థియోఫనేట్ 70%WP ను కలిపి పిచికారి చేయాలి.