మరోసారి చెబుతున్నా 'అది' చట్టంలోనే లేదు

‘అది’ అంటే ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం.ఆ విషయం ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోనే లేదట….! ఈ విషయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.ప్రత్యేక హోదా ప్రస్తావన విభజన చట్టంలో లేదనే విషయాన్ని తాను మరోసారి చెబుతున్నానని వెంకయ్య ఢిల్లీలో మీడియాకు చెప్పారు.

 Special Status Not Mentioned In Ap Reorganisation Act-TeluguStop.com

ప్రత్యేక హోదా ప్రస్తావన విభజన చట్టంలో లేకపోయినా ఆంధ్రా ఎంపీలు కోరుతున్నారని, ఇస్తామని తాము కూడా చెప్పాం కాబట్టి దీనిపై నిపుణులు పరిశీలిస్తున్నారని వెంకయ్య అన్నారు.స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వడం కోసం విభజన చట్టానికి సవరణలు చేసే అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు.

విభజన సమయంలో తాను ఒత్తిడి చేయడంవల్లనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం (అప్పటి యూపీఏ) అంగీకరించిందని అన్నారు.ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు మాట్లాడటం ఇది ఎన్నోసారో చెప్పలేం.

రాష్ర్ట విభజన జరిగినప్పటి నుంచి ఆయన దీనిపై తరచుగా మాట్లాడుతూనే ఉన్నారు.కాని పని కావడంలేదు.

మోదీ సర్కారుకు గడువు మరో నాలుగేళ్లు మాత్రమే ఉంది.ఆలోగానైనా ప్రత్యేక హోదా వస్తుందా? అనేది అనుమానమే.నిబంధనల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా పొందే హక్కు లేదు.మరి ఆనాడు యూపీఏపై ఒత్తిడి తెచ్చేటప్పుడు వెంకయ్యకు ఈ విషయం తెలియదా? అప్పటికప్పుడు రాష్ర్ట విభజన జరిగిపోవాలనే ఆత్రంలో ప్రత్యేక హోదా కోసం ఈయన డిమాండ్‌ చేస్తే, అంతే ఆత్రంగా ఉన్న యూపీఏ కూడా ఓకే అంది.కాని చట్టంలో లిఖితపూర్వకంగా లేదు.దానిపై ఆనాడూ ఎవ్వరూ పట్టుబట్టలేదు.

చిన్నపాటి ఒప్పందాలు కూడా కాగితాల మీద రాసుకుంటారు.కాని ఇంత పెద్ద విషయాన్ని చట్టంలో పొందుపరచకపోవడం ఏమిటి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube