కొన్ని రోజుల ముందు వరకు బ్రహ్మానందం లేని స్టార్ హీరో సినిమాను ఊహించుకోవడం కష్టం.అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది.
బ్రహ్మానందంను స్టార్ హీరోలు పక్కన పెడుతున్నారు.ఈయన బిజీ షెడ్యూల్ మరియు భారీ పారితోషికం వల్ల స్టార్ హీరోల సినిమాలకు అనేక సమస్యలు వస్తున్నాయి.
దాంతో ఈయన్ను పక్కన పెట్టేందుకు హీరోలు వెనకాడటం లేదు.మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ మరియు ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో బ్రహ్మానందం లేడు అనే విషయం తెల్సిందే.
బాలకృష్ణ ‘డిక్టేటర్’లో ఎంపిక అయిన బ్రహ్మానందంను తాజాగా ఆ సినిమా నుండి తొలగించారు.
భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు, తాను కోరిన డేట్లు ఇవ్వలేదనే దర్శక నిర్మాత శ్రీవాస్ ‘డిక్టేటర్’ నుండి బ్రహ్మానందంను తోసేయడం జరిగిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందుకు బాలకృష్ణ కూడా మద్దతు తెలిపాడట.ఒక సినిమాకు ఎంపిక అయ్యి, తొలగించబడటం అనేది బ్రహ్మానందంకు పెద్ద షాక్ అని చెప్పాలి.
ఇప్పటి వరకు బ్రహ్మానందంకు ఇలాంటి సంఘటన ఎదురైంది లేదు.తానే సుప్రీం అనుకున్న బ్రహ్మీకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం బ్రహ్మీ లేకుండా సినిమా సక్సెస్ అవ్వడం అంటే అంత సులభమైన విషయం కాదని అంటున్నారు.
మొత్తానికి బ్రహ్మానందం కాస్త జాగ్రత్త పడక పోతే కెరీర్ ఖతం అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.







