విజయ్‌ ఈసారైనా మెప్పించేనా?

తమిళ స్టార్‌ హీరోలు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, సూర్య, విక్రమ్‌, కార్తీలు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను కలిగి ఉన్నారు.అయితే తమిళంలో వీరితో సమానమైన క్రేజ్‌ ఉన్న విజయ్‌కు మాత్రం తెలుగులో ఇప్పటి వరకు సరైన మార్కెట్‌ లేదు.

 Jilla Movie Ready For Release In Telugu-TeluguStop.com

ఈయన తమిళంలో 100 కోట్ల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.కాని తెలుగులో మాత్రం ఈయన్ను గుర్తు పట్టే పరిస్థితి లేదు.

ఈయన తెలుగులో సైతం తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.కాని ఇప్పటి వరకు ఈయన నటించి, తెలుగులో డబ్‌ అయిన ఒక్క సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఈయన మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.గత సంవత్సరం ఈయన నటించిన ‘జిల్లా’ సినిమా తమిళంలో సంచలన విజయం సాధించింది.

ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి.దాంతో డబ్బింగ్‌ ఆలస్యం అయ్యింది.

అయితే చివరకు జిల్లా మూవీపై ఏ తెలుగు హీరో కూడా ఆసక్తి చూపక పోవడంతో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు.డబ్బింగ్‌ పూర్తి అయ్యి కూడా చాలా రోజులు అయ్యింది.

‘బాహుబలి’ ప్రభావంతో సినిమా ఆలస్యం అయ్యింది.ఇప్పటి వరకు ఏమాత్రం మార్కెట్‌ను ఏర్పర్చుకోలేక పోయిన విజయ్‌ ఈ సినిమాతో అయినా తెలుగులో మార్కెట్‌ను ఏర్పర్చుకుని, తన తోటి హీరోలకు పోటీ ఇస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube