ఫణి తుఫాన్ ధాటికి విలవిల్లాడిన ఒడిశా

ఫణి తుఫాన్ ధాటికి ఒడిశా విలవిల్లాడి పోయింది.గత కొద్దీ రోజులుగా ఫణి తుఫాన్ ప్రభావం తో ఇటు ఉత్తర కోస్తా ప్రాంతాలైన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ జిల్లా లు కూడా దెబ్బ తిన్నాయి.

 Odisha Faced Big Strom-TeluguStop.com

ఉత్తర కోస్తా జిల్లా ల నుంచి తీరం ధాటిన ఈ ఫణి తుఫాన్ ఒడిశా ను తాకడం తో ఒడిశా తీవ్రంగా దెబ్బతింది.పూరికి దక్షిణంగా బాలూగామ్-రంభ సమీపంలో తీరం దాటిన ఫణి తుఫాన్ భీభత్సం సృష్టించింది.

ఈ తుఫాన్ ప్రభావం కారణంగా శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో 200 నుంచి 240 కి.మీ వేగం తో రాకాసి గాలులు ఒడిశా ని వణికించాయి.భారీ వర్షం తో పాటు,విరుచుకుపడిన రాకాసి గాలుల కారణంగా తీరప్రాంతంలోని సెల్ టవర్స్ కూడా కుప్పకూలిపోవడం విశేషం.

మరోపక్క ఈ తీవ్ర గాలుల వలన లారీలు,బస్సులు,కార్లు, భారీ క్రేన్లు సైతం ఎగిరిపడ్డాయి.

అలానే అన్నీ ప్రభుత్వ ఆఫీసుల పై కప్పులు సైతం గాలికి ఎగిరి పోయాయి.భవనేశ్వర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రి భవన సముదాయంలోని ఒక వసతి గృహం పై కప్పు గాలికి కొట్టుకుపోయిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ తుఫాన్ కారణంగా 8 మంది మృతి చెందగా, భారీ ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా విద్యుత్ సరఫరా కూడా నిలిచినట్లు సమాచారం.ఈ తుఫాన్ కారణంగా అతలాకుతలం అయినా ఒడిశా కు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించింది.మరోపక్క పూరి వద్ద తీరం దాటిన ప్రచండ తుపాన్ కొంతమేర బలహీనపడి పెను తుపాన్గా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ల వైపు ప్రయాణం చేస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

రెండు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube