ఒకప్పుడు హీరోయిన్ అంటే సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది కాదు.హీరోయిన్ లు కూడా కొన్ని పాత్రలు చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు.
కానీ ఇప్పుడు రోజులు మారాయి.సినిమా అంటే అందరికి అవగాహన వచ్చింది.
హీరోయిన్ లు కూడా వారి పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది విన్నతరువాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.మంచి క్యారెక్టర్ అయితే చిన్న రోల్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు.
సమాజంలో వేశ్యలంటే చిన్న చూపు ఉంది.అయితే వీరి గురించి కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.
ఇక వేశ్యగా నటించాలంటే ముందు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు.కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఆ పాత్రలో ప్రాధాన్యత ఉంటె ఆ క్యారెక్టర్ లో నటించడానికి అయిన సరే సిద్ధమవుతున్నారు.
కెరీర్ మంచి పీక్ టైంలో ఉన్నప్పుడే ఈ స్టార్ హీరోయిన్ లు వేశ్యగా నటించారు.అనుష్క నుంచి బిందు మాధవి వరకు ఈ క్యారెక్టర్ లో నటించారు.
తాజాగా అనసూయ కూడా ఈ క్యారెక్టర్ లో నటించింది.ఇంతకీ ఈ పాత్రల్లో నటించిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూసేద్దాం.
అనుష్క:
అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పాన్ ఇండియా స్టార్స్ తో నటించింది.
స్టార్ హీరోస్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సృష్టించుకుంది.అయితే అనుష్క వేశ్య పాత్రలో కూడా నటించింది.
అల్లుఅర్జున్, మంచు మనోజ్ నటించిన చిత్రం వేదం( Vedam movie ).ఈ సినిమా ఇప్పటికి ఒక క్లాసిక్ అనే చెప్పాలి.ఈ సినిమాలో వేశ్య పాత్రలో అనుష్క అందరినీ మెప్పించింది.

అనసూయ:
యాంకర్ నుంచి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ( Anasuya Bharadwaj ).పుష్ప సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ తాజాగా ఒక సినిమాలో వేశ్య పాత్రలో నటించింది.
విమానం సినిమాలో ఆమె యాక్టింగ్ కు మంచి మార్కలే పడ్డాయి.రాబోయే చిత్రం ‘వుల్ఫ’లోనూ ఇదే పాత్ర ఉంటుందని సమాచారం.
విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

శ్రేయ:
శ్రేయ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.స్టార్స్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే శ్రేయ కూడా ఒక సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది.పవిత్ర అనే సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.
శృతి హాసన్:
కమలాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతిహాసన్.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.శృతి కూడా వేశ్య పాత్రలో నటించింది.హిందీ మూవీ ‘డీడే’ అనే సినిమాలో నటించింది.ఇందులో పాకిస్తాన్ కు చెందిన వేశ్యగా నటించింది.
రమ్యకృష్ణ:
రమ్యకృష్ణ అంటే ఇప్పుడు అందరికి గుర్తొచ్చేది బాహుబలి సినిమా అనే చెప్పాలి.అయితే రమ్యకృష్ణ సైతం వేశ్య పాత్రలో నటించింది.
సూపర్ డీలక్స్ అనే సినిమాలో రమ్యకృష్ణ నటన చూసిన వారందరు షాక్ అయ్యారు.అంతలా ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించారు.
సంగీత:
సంగీత కూడా ఒక వేశ్య పాత్రలో నటించారు.ధనం అనే సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది.
ఛార్మి:
ఛార్మి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఛార్మి జ్యోతిలక్ష్మి( Jyothi Lakshmi ) సినిమాలో వేశ్యగా నటించిన విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా, ఛార్మి వేశ్య పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

స్నేహ:
స్నేహ అంటే అందరికి ఫ్యామిలీ సినిమాలే గుర్తొస్తాయి.అయితే స్నేహ( Sneha ) కూడా ఒక సినిమాలో వేశ్య పాత్రలో నటించింది.దూల్ పేట అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది.

సదా:
సదా అంటే అందరికి ఒక క్లాస్ హీరోయిన్ గా మాత్రమే తెలుసు.జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టార్చ్ లైట్ అనే సినిమాలో వేశ్యగా కనిపించి మెప్పించింది.
బిందుమాధవి:
అవకాయ బిర్యానీ సినిమాతో తెరంగేట్రం చేసిన బిందుమాధవి బిగ్ బాస్ టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ తరువాత బిందుమాధవికి మంచి గుర్తింపు వచ్చింది.
బిందుమాధవి సెగ అనే సినిమాలో వేశ్య పాత్రలో కూడా అద్భుతంగా నటించింది.







